హెల్త్ టిప్స్

నూడుల్స్ తిన‌డం ఆరోగ్యానికి హానిక‌ర‌మా..? వీటిని తింటే ఏమ‌వుతుంది..?

నేటి రోజులలో త్వరగా తయారయ్యే ఆహారాలు వచ్చేశాయి. వాటిలో అందరూ ఇష్టపడే నూడుల్స్ ఒకటి. కాని ఈ రకమైన ఇన్ స్టాంట్ నూడుల్ ఆహారం అనారోగ్యకరం. ఇవి తయారు చేయబడి ప్యాక్ చేయబడి వుంటాయి. కనుక ఒక్కో సారి ఫుడ్ పాయిజనింగ్ లేదా పొట్టలో ఇన్ ఫెక్షన్ లకు అవకాశం వుంది. నూడుల్స్ తయారీలో నూనె బాగా వాడతారు. నూడుల్స్ శరీరానికి అనారోగ్యమని చెప్పేందుకు మరో కారణం వీటిలో కార్బోహైడ్రేట్లు అధికంగా వుండి శరీరంలో షుగర్ లెవెల్ పెంచేస్తాయి.

నూడుల్స్ లో లాభం చేకూర్చే ప్రొటీన్లు లేదా మినరల్స్ వుండవు. కనుక దీనిని జంక్ ఫుడ్ గా భావించాలి. నూడుల్స్ తయారీలో ఉపయోగించే పిండి అన్నిరకాలుగా వుంటుంది. ఇది మలబద్ధకం, డీహైడ్రేషన్ వంటివి కలిగిస్తుంది. నూడుల్స్ తయారీ సరిలేనపుడు అవి తింటే జీర్ణక్రియ సాఫీగా సాగక పొట్ట గడబిడకు గురై అజీర్ణం ఏర్పడుతుంది.

what happens if you take noodles are they healthy to us

నూడుల్స్ ఆరోగ్యకర ఆహారంగా వుండాలంటే, వాటిలో ప్రొటీన్లు, మినరల్స్, పచ్చటి కూరలు, కేరట్లు, కేప్సికం, బీన్స్ వంటివి చేర్చాలి. మీరు మాంసాహారి అయితే, నూడుల్స్ వంటకంలో మీరు గుడ్లు, మాంసం, చికెన్ వంటివి కూడా కలిపి తయారు చేసుకోవచ్చు. నూడుల్స్ తయారీ సరిగా లేకుంటే అనారోగ్యాన్ని కలిగిస్తుంది. వీటిని రెగ్యులర్ ఆహారంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Admin

Recent Posts