హెల్త్ టిప్స్

ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారా..ఈ నిజం తెలిస్తే..!!

ప్రస్తుత బిజీ ప్రపంచంలో కనీసం రోజుకోసారైనా ప్రకృతిని ఆస్వాదించేవారు చాలా తక్కువ మంది ఉంటున్నారని చెప్పవచ్చు. ఇక పెద్దపెద్ద పట్టణాల్లో ఈ సమస్య మరీ ఎక్కువైంది.దీంతో చాలామంది కాస్త రిలాక్స్ కావడానికి ఏసీలనే ఆశ్రయిస్తున్నారు. కొంతమంది ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు. ఏసీలో ఉంటే తాత్కాలిక ఉపశమనాన్ని పొందవచ్చు కానీ అనర్ధాలు కలిగిస్తుందని చాలామంది గ్రహించలేకపోతున్నారు. మరి ఏసీ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

కొంతమంది కార్ డోర్స్ మూసి ఉన్నటువంటి ఏసీల్లో ఎక్కువసేపు గడపడం వల్ల అందులో ఉండే సూక్ష్మజీవులు ఎటు వెళ్లలేక అక్కడే తిరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయి. దీంతో శ్వాస సంబంధమైన వ్యాధులు తలెత్తుంటాయి. కాబట్టి ప్రతి మనిషి రెండు గంటలకు ఒకసారి అయినా మామూలు వాతావరణంలో గడపాలని అంటున్నారు వైద్య నిపుణులు.

why you should not spend more time in ac

కొంతమంది ఎక్కువ సమయం ఏసీలో ఉండటం వల్ల ఎప్పుడైనా ఓసారి బయటి వాతావరణంలోకి వస్తే ఎండవేడిని తట్టుకోలేక వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం ఏసీలో గడిపే వారికి తేమ వ‌ల్ల‌ చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది. అలాంటి సమస్యలు ఉన్నవారు మాయిశ్చరైజ‌ర్‌ వాడితే మంచిది.

కొంతమంది ఎక్కువసేపు ఏసీలో పనిచేయడం వల్ల పని ముగిసే సమయానికి తీవ్రమైన తలనొప్పి, అలసటతో బాధపడుతున్నారట. ఎక్కువసేపు ఏసీ కారణంగా, చలి వల్ల కండరాలకు తగినంత రక్త ప్రసరణ జరగక అలసట వస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు.

Admin

Recent Posts