హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు వీటిని తింటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.. చురుగ్గా ప‌నిచేస్తారు..

వ్యాయామాలు చేసినా చేయకపోయినా, ఉదయంవేళ ఏ ఆహారం తిన్నా తినకపోయినా….మహిళలు రోజంతా మంచి మూడ్ లో వుండి తమ రోజువారీ పనుల్లో చురుకుగా, ఉత్సాహంగా వుండాలంటే, కుటుంబ సభ్యులకవసరమైన ఆహారాల తయారీలు చేయాలంటే….ఉదయమే తీసుకోదగిన కొన్ని పానీయాలు లేదా తిండి పదార్ధాలు చూడండి.

జింజర్ టీ – అల్లం టీని మనం సాధారణంగా జీర్ణక్రియ మెరుగుపడటానికిగాను పొట్ట సంబంధిత సమస్యలకు వాడుతూంటాం. అయితే అల్లం టీ మహిళలకు మరింత ఉత్సాహాన్నిచ్చి రోజంతా చురుకుగా వుంచుతుందని పోషకాహార నిపుణులు చెపుతున్నారు. జింజర్ టీ ఉదయమే ఒక కప్పు తాగితే చాలు రోజంతా ఉరకలేసే ఉత్సాహమే. అంతే కాదు దీని ప్రభావంతో వారు తమ భాగస్వాములకు సైతం మంచి ట్రీట్ కూడా ఇస్తారట.

woman who eat these will become active

చాక్లెట్ – చాక్లెట్ మెదడులో సంతోషానికి సంతృప్తికి, రిలాక్సేషన్ కు కారణమైన సెరోటోనిన్ అనే రసాయనాన్ని బ్రెయిన్ లో రిలీజ్ చేస్తుంది. మరింత ఆనందం కలగాలంటే డార్క్ చాక్లెట్ తింటే రోజులో అధిక సమయం పాటు సంతోషంగా గడిపేస్తారని, హాయి భావిస్తారని తెలుపుతారు. డార్క చాక్లెట్లో స్ట్రా బెర్రీలలోని యాంటీ ఆక్సిడెంట్ల సంఖ్యకంటే కూడా ఎనిమిది రెట్లు అధికంగా వుంటాయని వెల్లడైంది.

Admin

Recent Posts