నేటి రోజుల్లో డయాబెటీస్ వ్యాధి ఎంతో తేలికగా ఏదో ఒక రూపంలో చాలా మందికి చిన్న వయసుల్లోనే వచ్చేస్తోంది. మీరు సురక్షితంగా వుండాలనుకుంటే ఆహారం, షుగర్ వినియోగం వంటి వాటిలో కొంచెం జాగ్రత్తగా వుండాలి. అనారోగ్య ఆహారాలు తినరాదు. జంక్ ఫుడ్, వంటివి అసలే తినరాదు. ఇవి డయాబెటీస్ కు కారణమవుతాయి.
డయాబెటీస్ రాకుండా వుండాలంటే, అన్నిటికంటే ముందు మీరు ఆహారాన్ని, తినే విధానాలను మార్పు చేయాలి. ఇప్పటి వరకు తింటున్న అనవసర ఆహారాలను తినరాదు. ఆరోగ్యం, పోషక విలువలు కలిగి వుండాలంటే ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు తప్పక చేర్చండి. తినే ఆహారాన్ని నిర్దేశిత సమయాలలో తిని రక్తంలోని బ్లడ్ షుగర్ నియంత్రించండి. ఈ రకమైన తినే విధానం వలన డయాబెటీస్ నివారించుకోగలరు.
మరో రకంగా డయాబెటీస్ తగ్గించుకోవాలంటే, మీ సోషల్ లైఫ్ లేదా సామాజిక జీవితం చాలా చురుకుగా వుండేలా చూడండి. వ్యాయామాలు తప్పనిసరి. చురుకుగా వుండాలంటే, మరి కొన్ని సామాజిక చర్యలు కూడా చేపట్టాలి. డయాబెటీస్ ను వదిలించుకోవాలంటే లేదా నియంత్రించుకోవాలంటే పైన తెలిపిన చర్యలు క్రమం తప్పకుండా పాటిస్తూ వుంటే షుగర్ వ్యాధి సహజ విధానాల ద్వారా అదుపులోకి వచ్చేసినట్లే.