బ‌రువును త‌గ్గిస్తూ.. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే.. పుదీనా అల్లం టీ..!

పుదీనా.. అల్లం.. మ‌న ఇండ్లలో ఉండే ప‌దార్థాలే. కానీ వీటిని త‌క్కువ‌గా ఉప‌యోగిస్తారు. నిజానికి వీటికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. పుదీనా మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచితే.. అల్లం అధిక బ‌రువును త‌గ్గించ‌డంతోపాటు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. ఈ క్ర‌మంలోనే రెండింటినీ క‌లిపి టీ ని ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

mint ginger tea for weight loss and immunity

ఒక క‌ప్పు నీటిలో 4-5 పుదీనా ఆకులు, 1 టీస్పూన్ తురిమిన అల్లం వేసి బాగా మ‌రిగించాలి. సువాస‌న వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగాక అందులో కొద్దిగా టీపొడి వేయాలి. త‌రువాత అర క‌ప్పు పాలు పోయాలి. ఆ త‌రువాత మ‌ళ్లీ మ‌రిగించాలి. అనంత‌రం టీ ని వ‌డ‌క‌ట్టి వేడిగా ఉండ‌గానే తాగేయాలి.

అయితే పాల‌ను క‌ల‌ప‌కుండా కూడా ఈ టీని త‌యారు చేయ‌వ‌చ్చు. అవ‌స‌రం అనుకుంటే అందులో 1 టీస్పూన్ తేనె క‌లిపి తాగ‌వ‌చ్చు. కానీ చ‌క్కెర మాత్రం క‌ల‌ప‌కూడదు. ఇలా పుదీనా అల్లం టీని త‌యారు చేసుకుని రోజుకు 2 పూట‌లా తాగితే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతోపాటు అధిక బ‌రువు త‌గ్గుతారు.

Admin

Recent Posts