home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

చాలామంది ఇళ్లల్లో మొక్కల్ని పెంచుతారు. మొక్కల్ని పెంచి ఉన్న ఇల్లు చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది. పైగా మొక్కలు ఉన్నచోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. చక్కటి ఫీలింగ్ మనలో కలుగుతూ ఉంటుంది. అయితే చాలామంది మొక్కల్ని వేస్తూ ఉంటారు కానీ అవి అంత బాగా పెరగవు. ఎప్పుడు మొక్కలు వేసినా కూడా ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. అలా కాకుండా మొక్కలు బాగా చక్కగా ఎదగాలంటే ఇలా చేయాలి.

ఆపిల్స్ ని చాలామంది తింటూ ఉంటారు. ఆ తొక్కల్ని పారేసే బదులు మొక్కలకి వేయాలి. ఇలా చేయడం వలన ఆ మొక్కలు బాగా ఎదుగుతాయి. అలానే ఇతర పండ్ల తొక్కల్ని కూడా వేయొచ్చు. అరటిపండ్ల తొక్కల్ని వేస్తే పొటాషియం బాగా అందుతుంది. అరటి పండ్లు తొక్కలు మొక్కలకి వేస్తే ఎరువుగా పని చేస్తుంది. బియ్యం కడిగిన నీళ్లు కూడా మొక్కలకి వేయండి. చెట్టు మూలలకి బలాన్ని ఇస్తాయి.

follow these simple tips for plants in your home

సోయాబీన్స్ ని కూడా చాలామంది నానపెడతారు. ఆ నీటిని పారేస్తారు. అలా కాకుండా ఆ నీటిని మొక్కలకి చెట్లకి పోస్తే ఎదుగుతాయి. గుడ్డు పై పొట్టు కూడా చెట్లకు వేస్తే మంచిది. చెట్లకు దీనిని వేయడం వలన బాగా దృఢంగా పెరుగుతాయి. వీటిని డస్ట్ బిన్ లో పారేసే బదులు మొక్కలకు వేస్తే మొక్కలు బలంగా ఎదుగుతాయి.

కాఫీ టీ పొడిని కూడా మీరు మొక్కలకి వేయొచ్చు. చెట్లకు సహజ ఎరువులు ఇవి. మొక్కలు బాగా ఎదుగుతాయి. ఇలాంటి టిప్స్ ని పాటించారంటే మొక్కలు బాగుంటాయి. ఉల్లిపాయ పొట్టు, ఇతర కూరగాయల వ్యర్థాలని కూడా మొక్కల్లో వేయొచ్చు. కాబట్టి ఈసారి మొక్కలని బాగా పెంచాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలను ట్రై చేయండి.

Admin

Recent Posts