చిట్కాలు

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మంచి ఔష‌ధం ఇది..

మునగ ఆకుల‌లో విటమిన్లతో పాటు లవణాలు, యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా వుంటాయి. పోషకలేమితో బాధపడేవారికి మునగ మంచి ఔషధం. మునగాకుల్లో వుండే 46 రకాల సహజ యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను, కాలేయ సంబంధిత వ్యాధుల్ని, అల్జీమర్స్‌, అల్సర్లను అదుపు చేస్తాయి. కీళ్ళనొప్పులను తగ్గించడంలోను మునగ ముందుంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి మునగాకుపొడి మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

మునగ గాయాలను త్వరగా మానేలా చేస్తుంది. పోషకాహారం తగినంత అందని బాలింతలకు గర్భిణీలకు మునగాకు పొడి దివ్యౌషధంలా పనిచేస్తుంది. మునగాకులో ఇనుము అధికంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు రోజూ ఆహారంలో మునగాకును రోజూ ఆహారంలో చేర్చుకోవాలి.

drumstick leaves are best medicine for weight loss

ఎండిన మునగ గింజల పొడి.. నీటిలోని మలినాలను తొలగించేందుకు ఉపయోగపడుతుంది. ఈ గింజల నుంచి తీసిన నూనెను కొన్ని రకాల వ్యాధులను అదుపు చేసేందుకు వాడుతారు. సుగంధ ద్రవ్యాలు, నూనెల తయారీలోను ఉపయోగిస్తారు.

Admin

Recent Posts