చిట్కాలు

ఈ నాచుర‌ల్ టిప్స్‌ను పాటిస్తే మీ జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..

ఒకప్పుడు ముసలితనం వచ్చాక మొదలయ్యే తెల్ల వెంట్రుకలు… ఇప్పుడు చిన్న వయసులోనే కనిపిస్తున్నాయి. జీవనశైలి మార్పులూ, పోషకాల లేమి, మెలనిన్ తక్కువగా ఉండటం వంటివన్నీ ఇందుకు కారణాలే. ఈ సమస్యను అధిగమించడానికి ఈ చిట్కాలు కొంతవరకూ తోడ్పడతాయి. విటమిన్ మాత్రలు: సి, ఇ, బి7, బి9, బి12 వంటి విటమిన్ల లోపం కారణంగా కూడా తెల్ల జుట్టు రావొచ్చు. తీవ్రమైన ఐరన్, జింక్ లోపంతోనూ ఈ ఇబ్బంది ఎదురవుతుంది. ఇలాంటప్పుడు వైద్యుల్ని సంప్రదిస్తే… సంబంధిత సప్లిమెంట్లను సూచిస్తారు. ఆహారంతోనూ ఈ పరిస్థితిని అధిగమించొచ్చు. అలాగే కొన్ని సహజమైన పద్ధతులతో కూడా తెల్ల జుట్టుకి చెక్ పెట్టవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉసిరి: ఈ కాయల్లో యాంటాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు నెరసిపోకుండా కాపాడతాయి. పెరుగుదలకూ సహాయపడతాయి.

ఉసిరిని చిన్న ముక్కలుగా కోసి గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. సగం నీరయ్యాక దించి చల్లారనిచ్చి మాడుకు పట్టించాలి. అరగంట ఆగి మాములు నీళ్లతో తలస్నానం చేయాలి. కొబ్బరినూనె: జుట్టుకు సరైన పోషకాలు అందకపోవడం వల్ల కూడా తెల్లవెంట్రుకలు వస్తుంటాయి. తలకు కొబ్బరి నూనెను రోజూ పట్టించాలి. కరివేపాకు నూనె: దీనిలో బయోయాక్టివ్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జట్టు సంరక్షణకు దోహదపడతాయి. ఇందుకు కప్పు కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకు వేసి మరిగించాలి. చల్లారాక వడపోసి దాన్ని మాడు నుంచి కుదుళ్ల వరకు పట్టించాలి. గంట తర్వాత గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరి. ఇలా నెలకు రెండుసార్లైనా చేస్తే ఫలితం ఉంటుంది.

follow these natural tips to turn you white hair into black

కలబంద గుజ్జు: క్యాల్షియం, సెలెనియం, జింక్, క్రోమియం వంటి పోషకాలు తల నెరవకుండా దోహదపడతాయి. ఇవన్నీ కలబంద గుజ్జులో పుష్కలంగా ఉంటాయి. ఈ గుజ్జుకి హెన్నా, కాఫీ లేదా టీ డికాక్షన్ లు కలిపి తలకు రాస్తే క్రమంగా సమస్య తగ్గుతుంది.

భృంగరాజ్ ఆయిల్: ఇందులో మెలనిన్ ఉత్పత్తికి దోహదపడే బయోయాక్టివ్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి సహజమైన మెరుపును అందిస్తాయి. ఈ నూనెను తలకు పట్టించి తక్కువ పీహెచ్ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి.

Admin

Recent Posts