చిట్కాలు

గ్యాస్ స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా.. ఈ స‌హ‌జసిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి..

ప్రతి పదిమందిలో ఒకరు పొట్టలో గ్యాస్, అపానవాయువులు, పొట్ట బిగదీయటం, నోటి చెడువాసన మొదలగు సమస్యలతో బాధపడుతూంటారు. వీటి నివారణకుగాను ఎన్నో రకాల మందులు వాడటం కూడా చేస్తూంటారు. అయితే, ఈ రకమైన గ్యాస్ సమస్యలు కలవారు వారు అసౌకర్యం భావించటమే కాక, పక్కన వున్న ఇతరులకు కూడా చెడు వాసనలతో, వింత శబ్దాలతో చికాకు పరుస్తూంటారు. మరి పొట్టలో గ్యాస్ తగ్గించుకొని ఆరోగ్యంగా వుండాలంటే కొన్ని సహజ విధానాలు సూచిస్తున్నాం పరిశీలించండి.

అపానవాయువులకు కారణం ఆహార గొట్టంలో గాలి బుడగలు ఏర్పడటం. ఈ గాలి బుడగలే గ్యాస్ గా మారి అపాన వాయువుల‌ను కలిగిస్తాయి. అందుకుగాను ఆహారానికి నేరుగా మార్గం కలిపించాలి. నిదానంగా ఆహారం తీసుకోవటం, ఆహారం బాగా నమిలి మింగడం వంటివి చేయాలి. నురగలు కక్కే కూల్ డ్రింకులు, ఉల్లిపాయలు, మసాలాలు వంటివి తినడం మానాలి. సహజ మందులుగా పుదీనా ఆకులనుండి తయారైన టీ, హెర్బల్ టీ, సహజ యాంటాసిడ్లు అయిన బేకింగ్ సోడా, తులసి ఆకు, మందార టీ వంటివి తక్షణమే గ్యాస్‌ను తగ్గిస్తాయి. పుదీనాను నోటి సువాసన పదార్ధంగా కూడా వాడవచ్చు.

if you are facing gas trouble problem follow these tips

ఇంగువ‌.. ఘాటైన ఈ ఔషధం పొట్టలో అధిక గ్యాస్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. ఇంగువను మజ్జిగ లేదా నిమ్మరసంతో తీసుకోవచ్చు. వెనిగ‌ర్‌ను నిమ్మరసంతో కలిపి భోజనం ముందర తీసుకుంటే త్రేన్పులు రావడం, యాసిడ్ ఏర్పడకుండా వుండటం జరుగుతుంది. వెల్లుల్లి, లవంగం రెండూ బాగా నూరి మజ్జిగ లేదా వేడి నీటితో పేస్టులా చేసి తగుమాత్రం గా క్రమం తప్పకుండా ప్రతిరోజూ తీసుకుంటే అజీర్ణం, గ్యాసు తగ్గుతాయి. ఒక చెంచాడు మెంతులు ఖాళీ పొట్టతో తింటే అది సహజ ఔషధంగా అపానవాయువులకు పనిచేస్తుంది. చేదైన ఈ మెంతులు నోటిని శుభ్రంగా వుంచి ఆరోగ్యం ఇస్తాయి.

Admin

Recent Posts