తలనొప్పి భరించలేక చాలామంది రెగ్యులర్ గా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. ఇది ప్రమాదకరమని చెబుతున్నారు నిపుణులు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలను పాటించి చూడండి.
తాజా ద్రాక్ష పండ్లను తీసుకొని జ్యూస్ చేసి తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్ ను రోజుకు రెండుసార్లు తాగితే సరిపోతుంది.
ఒత్తిడిని, ఒళ్లు నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది అల్లం. తల నొప్పిని కూడా తగ్గుస్తుంది. అల్లం రసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
దాల్చిన చెక్క ఆహారానికి రుచిని ఇవ్వడమే కాదు.. తలనొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కను పొడిగా చేసి నీటిలో కలిపి నుదుటిపై రాసుకొని 30 నిమిషాలు తర్వాత వేడి నీటితో కడిగితే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.
తల నొప్పి ఎక్కువైనప్పుడు మసాజ్ చేసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మెడ, తల భాగాన్ని నొక్కుతూ మెల్లగా మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ పెరిగి రిలాక్స్ అవుతారు. నొప్పి కూడా దూరం అవుతుంది.