చిట్కాలు

వేపాకుల‌తో చుండ్రును త‌రిమికొట్టండిలా.. ఈ చిట్కాలు బాగా ప‌నిచేస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుత తరుణంలో చాలామంది జుట్టు రాలిపోవడం&comma; చుండ్రు వంటి సమస్యలతో బాధపడుతున్నారు&period; ఈ సమస్య నుంచి బయటపడేందుకు అనేక రకాల హెయిర్ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తున్నారు&period; అయినప్పటికీ ఫలితం ఉండడం లేదని విచారిస్తున్నారు&period; అయితే చుండ్రు జుట్టు రాలిపోవడం వంటి సమస్యలను తగ్గించేందుకు వేపాకులు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి&period; వేపాకుల్లో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి&period; అందువల్ల వేపాకులను వాడితే చుండ్రు తగ్గుతుంది&period; దీంతోపాటు జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడవచ్చు&period; ఇక వేపాకులను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక కప్పు వేపాకులను తీసుకొని శుభ్రంగా కడగాలి&period; ఐదు కప్పుల నీటిలో ఆ వేపాకులను వేసి బాగా మరిగించాలి&period; దీంతో నీరు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది&period; నీరు చల్లారిన తర్వాత వడకట్టి ఆ నీటిని ఉపయోగించి జుట్టును శుభ్రం చేయాలి&period; తర్వాత కొన్ని నిమిషాలు ఆగి తల స్నానం చేయాలి&period; ఇలా చేస్తుంటే చుండ్రు తగ్గుతుంది&period; జుట్టు రారడం ఆగుతుంది&period; వేపాకులతో హెయిర్ ప్యాక్ ను కూడా వేసుకోవచ్చు&period; వేపాకులను కొన్ని తీసుకొని శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్‌లా చేయాలి&period; దాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి&period; అనంతరం ఆ పేస్టుని జుట్టుకు బాగా పట్టించాలి&period; తర్వాత 15 నుంచి 20 నిమిషాలు ఆగి తలస్నానం చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48774 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;neem-leaves-for-dandruff&period;jpg" alt&equals;"neem leaves for dandruff how to use them for better effect " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేపాకులను&comma; ఉసిరికాయల‌ను ఉపయోగించి కూడా ఒక చిట్కాను పాటించవచ్చు&period; అందుకు గాను మూడు స్పూన్ల ఉసిరికాయ పొడి&comma; మూడు లేదా నాలుగు టీ స్పూన్ల వేపాకుల పొడి తీసుకొని నీటితో కలిపి మెత్తని పేస్ట్ లా చేయాలి&period; దీన్ని జుట్టుకు పట్టించి 15 నుంచి 20 నిమిషాలు ఆగిన తర్వాత కడిగేయాలి&period; ఇలా చేస్తుంటే జుట్టు రాల‌టం తగ్గుతుంది&period; మార్కెట్లో మనకు వేప నూనె లభిస్తుంది&period; వేప నూనెతో జుట్టును బాగా మర్ద‌నా చేయాలి&period; 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; తర్వాత మైల్డ్‌ షాంపూతో తల స్నానం చేయాలి&period; ఈ విధంగా కొన్ని చిట్కాలను పాటించడం వల్ల జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడవచ్చు&period; శిరోజాలు ఒత్తుగా పొడవుగా పెరిగి కాంతివంతంగా మారుతాయి&period; జుట్టు ప్రకాశిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts