చిట్కాలు

పచ్చ కర్పూరాన్ని హారతికి మాత్రమే కాదు.. ఎన్నో అనారోగ్యాలను నయం చేయడానికి ఉపయోగించచ్చు.. ఎలాగో చూడండి!

కర్పూరాల్లో చాలా రకాలున్నాయి. పచ్చకర్పూరం తెల్లకర్పూరంకన్నా చాలామంచిది. ఇది పలుకులుగా దుకాణంలో దొరుకుతుంది. దీన్ని రెండు పలుకులు తీసుకుని కొంచెం మంచి గంధాన్నిగానీ, వెన్ననుగానీ కలిపి తమలపాకులో పెట్టి నమిలిరసాన్ని మింగితే వెంటనే వేడి తగ్గుతుంది. కళ్ళుబైర్లు కమ్మడం, తలతిరుగుడు, కడుపులో వికారం, అతిగా శరీరానికి చెమటలు పట్టడం తగ్గిపోతాయి. బాగా పైత్యం చేసినవారు పచ్చ కర్పూరాన్ని తీసుకుంటుంటే పైత్య వికారాలన్నీ తగ్గిపోతాయి. కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు పచ్చకర్పూరాన్ని తీసుకుంటుంటే కళ్ళమంటలు, కళ్ళు ఎరుపెక్కడం, కళ్ళవెంటనీరు కారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి.

బి.పి వున్నవారు రెండుపూటలా పచ్చకర్పూరాన్ని తీసుకుంటే బి.పి పెరగకుండా అరికడుతుంది. మూత్రం పోసేటపుడు, మంట, చీము, సుఖవ్యాధులున్నవారు పచ్చకర్పూరాన్ని గంధంతో కలిపి తీసుకుంటుంటే బాధలన్నీ నివారిస్తాయి. వేడి చేయడం వలన కలిగే ఒళ్ళుమంటలు, అరికాళ్ళూ, అరిచేతుల మంటలు మొదలైన వాటికి పచ్చ కర్పూరాన్ని గ్లాసుడు పాలతో కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

pacha karpuram gives these wonderful benefits

పచ్చకర్పూరం అయిదు గ్రాములు, జాజికాయ అయిదు గ్రాములు, జాపత్రి అయిదు గ్రాములు ఈ మూడింటిని మొత్తగానూరి, దాంట్లో అయిదు గ్రాములు ఎండుద్రాక్షవేసి మళ్ళీనూరి, దీన్ని శనగగింజలంత మాత్రలగా తయారుచేసి పెట్టుకుని రోజూ పడుకోబోయే ముందు ఒక మాత్ర వేసుకుని, పాలు తాగుతుంటే వీర్యం వృద్ధి చేందుతుంది. లైంగికశక్తి బాగా పెరుగుతుంది. పచ్చకర్పూరాన్ని రోజూ మూడుపూటలా ఒకటి, రెండు పలుకులు తీసుకుంటుంటే, బలం, రక్తపుష్టి కలుగుతుంది. లైంగికశక్తి పెరుగుతుంది. బి.పి తగ్గుతుంది. కంటిజబ్బులు, రక్తస్రావాలు అరికడతాయి. ఏ మందు వాడుతున్నపుడైనా ఆమందుతోపాటు ఒక పలుకు పచ్చకర్పూరం కలిపి తీసుకుంటే ఔషధగుణం పెరుగుతుంది.

Admin

Recent Posts