చిట్కాలు

మ‌జ్జిగ‌లో వీటిని క‌లిపి తాగండి.. మ‌ల‌బ‌ద్దకం అన్న మాటే ఉండ‌దు..!

దీర్ఘకాలిక మలబద్ధకం వల్ల శరీరంలో అనేక ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. మలబద్ధక సమస్య క్రమంగా పైల్స్‌కు దారితీస్తుంది. దీన్ని నివారించాలంటే మీ ఆహారంలో మజ్జిగను చేర్చుకోవడం మంచిది. సాధారణ మజ్జిగకు బదులుగా జీలకర్ర, రాక్ సాల్ట్ కలిపిన మజ్జిగను త్రాగండి. ఈ సూపర్ డ్రింక్ తాగడం వల్ల మలబద్దక సమస్య నుంచి రిలీఫ్ లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మజ్జిగలో జీలకర్ర, రాక్ సాల్ట్, కొత్తిమీర కలిపి తగడం మరింత ప్రభావంతంగా పనిచేస్తుంది. మజ్జిగలో జీలకర్ర, రాక్ సాల్ట్ కలిపి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మన ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మలబద్ధకం సమస్యను అధిగమించడానికి, ఆహారంలో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాల్ని ఎక్కువగా చేర్చుకోండి.

మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి కడుపులో బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. మజ్జిగ కడుపుని చల్లబరుస్తుంది. పేగుల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీలకర్రలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గ్యాస్, ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇది జీర్ణ ఎంజైమ్‌లను క్రమబద్దీకరిస్తుంది. జీలకర్రలో పోషకాలు మెండుగా ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. గుండెని ఆరోగ్యంగా ఉంచుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. మెటబాలిజం పెంపొందిస్తుంది. జీర్ణ సమస్యల్ని తొలగించడానికి జీలకర్ర బాగా సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల్ని తగ్గిస్తుంది. ఎసిడిటీతో బాధపడుతున్నట్లుయితే.. జీలకర్రను తీసుకోవడం మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఛాతి మంట, ఎసిడీటీ, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యల్ని జీలకర్ర తగ్గిస్తుంది. జీలకర్రను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే పొటాషియం, ఐరన్ ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది.

take butter milk in this way to get rid of constipation

మజ్జిగ మలబద్ద‌కం పనిపడుతుంది. ఇందుకోసం గ్లాసు మజ్జిగలో జీలకర్ర, కొత్తిమీర కలిపి తీసుకోవాలి. రోజూ తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం, ఇతర కడుపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, మజ్జిగ పల్చగా ఉండాలి. మజ్జిగను ఉదయం లేదా మధ్యాహ్నం ఆహారం తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. జీలకర్రను పొడి చేసుకుని మజ్జిగలో కలిపి తాగొచ్చు. రుచికి సరిపడా రాక్ సాల్ట్ కూడా కలుపుకోవచ్చు.

Admin

Recent Posts