చిట్కాలు

త‌ల‌నొప్పి త‌గ్గేందుకు ఈ 4 ఆహారాలను తీసుకోవ‌చ్చు.. కానీ..?

తలనొప్పి చాలామందికి సాధారణ ఆరోగ్య సమస్య. ఎవరికైనా, రోజులో ఎపుడైనా సరే ఇది వచ్చేస్తుంది. ఒత్తిడి, హేంగోవర్, నిద్ర సరిలేకుండుట, మైగ్రేన్ వంటి కారణాలుండవచ్చు. మరి దీనినుండి విముక్తి పొందాలంటే సాధారణంగా ప్రతివారూ 4 అలవాట్లు ఆచరిస్తారు. తలనొప్పి వచ్చిందంటే, కాఫీ తాగేస్తారు. కాని ఇది నరాల వ్యవస్ధను ఉద్రేకపరచే ఒక ఔషధం. తాగిన తర్వాత మూత్రం పోసేసినా సరే….దాని ప్రభావం 5 గంటలపైగా వుంటుంది. అందరూ రెండు కప్పులు తాగేస్తే తలనొప్పి పోతుందనుకుంటారు కాని, తాత్కాలికంగా తగ్గించినా అది మరల పెంచుతుంది. అంతేకాదు కాఫీ అధికమైతే శరీరం డీహైడ్రేషన్ కు లోనవుతుంది. కనుక తలనొప్పికి కాఫీ తాగటం చెడు అలవాటే.

టీ – ఇది కూడా ఒక హెర్బల్ మెడిసిన్ ప్రత్యామ్నాయం. ఏ పనిలో వున్నా తలనొప్పి వచ్చిందంటే చాయ్ తాగేస్తారు. పనిఒత్తిడికి మంచి మందుగా భావిస్తారు. అయితే గ్రీన్ టీ ఒక కప్పు వరకు మంచి రిలీఫ్ ఇస్తుంది. అధికమైతే, దీనితో కూడా సమస్యలే. శరీరం డీహైడ్రేట్ అవటం, అజీర్ణం, యూరిక్ యాసిడ్ ఏర్పడటం వంటివి వుంటాయి. తలనొప్పి తగ్గాలని సాధారణంగా ఒక చాక్లెట్ తింటారు. ప్రత్యేకించి మహిళలు డార్క్ చాక్లెట్ తింటారు. డార్క్ చాక్లెట్ లో వున్న కోకో పౌడర్ రిలీఫ్ ఇస్తుంది కాని అధికంగా ఈ చాక్లెట్ లు తింటే తలనొప్పి పెరుగుతుంది. డార్క్ చాక్లెట్ అధికమైతే బరువు పెరుగుతుంది.

you can take these 4 foods if you have headache

వాల్ నట్స్ – వాల్ నట్ ఆరోగ్యకరమే కనుక మంచి అలవాటే. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. ఇవి డిప్రెషన్, తలనొప్పి వంటి వాటినుండి దూరం చేసి చురుకుగా వుంచుతాయి. అయితే ఇవి అధికంగా తింటే, బరువు పెరగటం, విరేచనాలు, అజీర్ణం వంటివి ఏర్పడతాయి. తలనొప్పి తగ్గించుకోడానికిగాను సాధారణంగా ఈ 4 అలవాట్లు ఆచరిస్తారు.

Admin

Recent Posts