Home Tips

మీ ఇంట్లో ఎలుక‌ల బాధ ఎక్కువ‌గా ఉందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..

చాలామంది ఇంట్లో శుభ్రం చేసుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎంత క్లీన్ చేసినా కూడా ఏదో ఒక పని అలా ఉంటూనే ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా మంది క్లీనింగ్ మీద ఎక్కువ సమయాన్ని పెడుతూ ఉంటారు. మామూలుగా క్లీన్ చేసుకోవడమే పెద్ద ఎత్తు. అయితే ఎలుకలు వంటి ఇబ్బందులు ఉంటే అది మరింత ఇబ్బందిగా ఉంటుంది ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా ఇల్లు అడవిలానే ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఎలుకలు ఎక్కువైపోయాయా..? ఎలుకల నుంచి బయట పడాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి.

అప్పుడు ఎలకల బాధ నుండి బయట పడొచ్చు. మీ ఇంట్లో కాని మీ పరిసరాల్లో కానీ ఎలుకలు ఉన్నట్లయితే ఈ టిప్స్ తో మీరు ఎలుకలని తరిమి కొట్టేయొచ్చు. చాలా మంది మార్కెట్లో దొరికే ప్యాకెట్స్ ని పెడుతుంటారు అలా కాకుండా ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఎలుకలకి బోన్లు అమ్ముతుంటారు వీటిని మీరు ఇంట్లో పెట్టారంటే కచ్చితంగా ఎలుకలు పడతాయి. బోన్ లో మీరు ఒకటి టమాటా పండు కానీ ఏదైనా ఆహారపదార్దాన్ని కానీ ఏదైనా పెడితే ఎలుకలు అక్కడ ఏదో ఉందని వచ్చి బోన్లో పడతాయి వాటిని పట్టి మీరు దూరంగా వదిలేయవచ్చు.

if you have rats in home follow these tips

ఎలుకలు రాకుండా ఉండడానికి మీరు పెప్పెర్మింట్ ఆయిల్ ని ఉపయోగించవచ్చు లవంగాలని కూడా ఇంట్లో పెట్టొచ్చు. ఇవి ఉండడం వలన ఎలుకలు మీ దరి చేరవు కొంచెం మిరియాలని నలిపేసి ఎలుకలు రాకుండా మీరు ఇంట్లో చల్లండి. ఇలా చేస్తే కూడా ఎలుకలు రావు ఎలుకలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీరు రెండున్నర కప్పుల అమోనియాలో వంద లేదా 200 మిల్లీలీటర్లు నీళ్లు పోసి రెండు మూడు స్పూన్లు డిటర్జెంట్ ని వేసి ఎలుకలు ఎక్కువగా కనబడే చోట పెట్టండి.

అమోనియా వాసనకి ఎలుకలు చచ్చిపోతాయి లేదంటే అక్కడికి రాకుండా పారిపోతాయి. గుడ్లగూబ ఈకల్ని పెడితే కూడా ఎలుకలు పారిపోతాయి ఉల్లిపాయ వాసనకి కూడా ఎలుకలు పారిపోతాయి. మనుషులు జుట్టు ఎక్కడ కనిపించినా కూడా ఎలుకలు పారిపోతాయి. ఈరోజుల్లో ఎలక్ట్రానిక్ ర్యాట్ ట్రాప్స్ కూడా అమ్ముతున్నారు వాటిని కూడా మీరు ఉపయోగించవచ్చు ఇలా ఎలుకలని తరిమికొట్టచ్చు.

Admin

Recent Posts