information

రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

మనం ఇప్పటివరకు ఎన్నో సార్లు రైలులో ప్రయాణం చేసి ఉంటాం. లేదా కనీసం రైలుని చూసి అయినా ఉంటాం. అయితే రైలు గురించి మనం తెలుసుకోవడానికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. రైలు పట్టాల దగ్గర నుండి బోగీ వరకు, రైలు ఇంజన్ నుండి లోపల తిరిగే ఫ్యాన్ ఇలా వరకు అన్ని ఆసక్తికరమే. రైలులో ప్రయాణించేటప్పుడు కిటికీ పక్కన కూర్చొని, ఆ కిటికీలోంచి బయటకి చూస్తూ ఉంటాం. అప్పుడు ఆ కిటికీకి అమర్చిన ఇనుప కడ్డీలు అడ్డంగా అమర్చబడి ఉంటాయి. మరి అవి అలా ఎందుకు ఉన్నాయి? నిలువుగా ఎందుకు లేవు? అని ఎప్పుడైనా ఆలోచించారా..? దానికి కారణం ఏంటో తెలుసుకుందాం..!

మనం రైల్లో వెళ్లేటప్పుడు బయట నుంచి ఏవైనా తిను బండారాలు వచ్చినప్పుడు అవి తొందరగా తీసుకోవడానికి, అడ్డు కడ్డీలు బిగిస్తారు. అలాగే అడ్డం కడ్డీలు ఉంటే కాఫీ, టీ కప్పులు ఇలాంటివి చాకచక్యంగా తీసుకోవచ్చు. అలాగే అడ్డం కడ్డీలు చూడడానికి ఇంపుగా ఉంటాయి. అదే నిలువు కడ్డీలు పెడితే అందులో నిర్బంధించిన ఫీలింగ్ మనసులో కలుగుతుంది. ముఖ్యంగా జైలు చువ్వలు, పక్షిపంజరాలు, ఇంటి ఫెన్సింగ్ ఇలాంటివి నిలువు కడ్డీలతో చేస్తారు. ముఖ్యంగా నిలువు చువ్వలకంటే అడ్డం చూవ్వలు తొందరగా వంగుతాయని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు అడ్డం కడ్డీలు ఉంటే తొందరగా వాటిని పగులగొట్టి బయటపడవచ్చు.

do you know why train windows have horizontal lines

అలాగే రైలు కోచ్‌కి ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న కిటికీల అడ్డు కడ్డీలు.. మిగిలిన కిటికీల అడ్డు కడ్డీలకు తేడా ఉంటుంది. రెండు ఒకేలా ఉండవు. ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న కిటికీలు మిగిలిన వాటితో పోలిస్తే ఎక్కువ ఇనుప కడ్డీలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో రైలు కోచ్‌కి ప్రవేశ ద్వారం దగ్గరి కిటికీ నుంచి దొంగతనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వాటిని నిరోధించడానికి, దొంగల నుండి ప్రయాణీకులను రక్షించడానికి ఇవి ఉపయోగపడతాయి.

Admin

Recent Posts