information

FIR ఎలా నమోదు చేయాలి? అందులో ఏయే అంశాలు ప్రస్తావించాలి.. పూర్తి సమాచారం..

FIR…First Information Report…. ను పోలీస్ లకు అందిన మొదటి సమాచారం అని చెప్పవచ్చు.ఇక్కడ నుండే న్యాయ విచారణ అనేది చట్ట ప్రకారం గా ప్రారంభమవుతుంది. ఇదే సాక్ష్యాల సేకరణకు, పరిశోధనకు, నేరరుజువుకు పునాది లాంటిది. ఇప్పటికీ చాలా మందికి FIR గురించి, FIR ఎలా ఇవ్వాలి, అందులో ఎటువంటి అంశాలను ప్రస్తావించాలి, FIR చేయడంలో ఆలస్యమైతే ఏం చేయాలనే అంశాల గురించి సరైన అవగాహన లేదు. అలాంటి వారి కోసమే ఈ వివరణ. సమాచారాన్ని రాతపూర్వకంగా కానీ, నోటిమాటల ద్వారా కానీ ఇవ్వొచ్చు. ఒకవేళ పిర్యాదుదారుడు నోటి మాట ద్వారా సమాచారం ఇచ్చినట్టైతే…దాన్ని పోలీస్ లు కాగితంపై రాసి…దానిపై సదరు పిర్యాదు దారుని సంతకం చేయించుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు విధిగా ఓ జిరాక్స్ కాపీని పిర్యాదు దారునికి అందించాల్సిన బాధ్యత పోలీసులదే.!

ఏదైనా స్టేషన్ అధికారి మీరిచ్చిన కంప్లైంట్ ను నిరాకరిస్తే….డైరెక్ట్ గా SP కి మీ కంప్లైంట్ ఇవ్వొచ్చు. IPC 217 కింద కంప్లైంట్ ను తిరస్కరించడం నేరంగా పరిగణించబడుతుంది. దీనికి కారణమైన అధికారి పై విచారణ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. FIR ను కేవలం బాధితులే ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రత్యక్ష సాక్ష్యులు,స్వచ్చంధ సంస్థల వారు, బంధువులు…ఇలా ఎవరైనా FIR ఇవ్వొచ్చు. ఫోన్ ద్వారా కూడా FIR ను రికార్డ్ చేయించొచ్చు…కానీ ఈ సమాచారం మీరే ఇచ్చారనే ధృవీకరణ కోసం మీ సంతకం చేయాల్సి ఉంటుంది. ఏ నేరం గురించైతే…ఫిర్యాదు చేయాలనుకుంటున్నారో అది ఎక్కడ,ఎప్పుడు, ఎలా జరిగింది, దానికి కారణమేంటి? ఎంత మంది నేరస్తులున్నారు అనే అంశాల గురించి చెప్పాల్సి ఉంటుంది.ఒకవేళ నేరానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు తెలియనప్పుడు కేవలం నేరం గురించి మాత్రమే ప్రస్తావించి కూడా మీ FIR ను నమోదు చేయొచ్చు.

what is fir and how to file it

ఘటన జరిగిన వెంటనే కంప్లైంట్ ఇవ్వడం మంచిది. కానీ అన్ని సంద‌ర్భాల్లో ఇది కుదరకపోవొచ్చు. అయినప్పటికీ…. జాప్యానికి గల కారణాలను కోర్ట్ లో సంతృప్తికరంగా వివరించగలిగితే మీ FIR ను స్వీకరిస్తారు. రెండు స్టేషన్ల మద్య ఘటన జరిగితే.. యాక్సిడెంట్ లాంటి కేసుల విషయంలో ఈసమస్య తలెత్తుతుంది. సరిహద్దు ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగితే….కేసు ఎక్కడ నమోదు చేయాలనే డౌట్ వచ్చినప్పుడు…మొదట ఎక్కడైతే ఫిర్యాదు చేశారో ఆ పోలీస్టేషన్ విచారణ చేపట్టాలి. తర్వాత FIRను ఆ పరిధిలోని స్టేషన్ కు ట్రాన్ఫర్ చేయవచ్చు.

Admin

Recent Posts