information

వాహనాలకు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు.. ఎందుకు? లేకపోతే ఏమౌతుంది?

హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు వాహన దొంగతనాలను నివారించడానికి సహాయపడతాయి. దేశవ్యాప్తంగా నంబర్ ప్లేట్లలో యూనిఫార్మిటీని నిర్ధారిస్తాయి. రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి, వాహనాలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడతాయి.

మీ వాహనం ఏప్రిల్ 1, 2019 కి ముందు రిజిస్టర్ చేయబడి ఉంటే.. అధికారిక HSRP బుకింగ్ పోర్టల్‌ను సందర్శించండి (సాధారణంగా ప్రభుత్వ అధికారం కలిగిన విక్రేత ద్వారా అందించబడుతుంది). HSRP ఇన్‌స్టాలేషన్ కోసం స్లాట్‌ను బుక్ చేసుకోండి. సెప్టెంబర్ 30, 2025 కి ముందే ప్లేట్‌ ను సరిచేయండి.

why high security number plates are required

ఈ నంబర్ ప్లేట్స్ కోసం వాహనం ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్స్ తప్పనిసరిగా ఉండాలి. బైకులకు రూ.320 నుండి రూ.500 వరకు, ఆటోలకు రూ.350 నుండి రూ.450 వరకు, కార్లకు రూ.590 నుండి రూ.860 వరకు, కమర్షియల్ వాహనాలకు రూ.600 నుండి రూ.800 వరకు నంబర్ ప్లేట్ రేట్లు ఉండనున్నాయి.

Admin

Recent Posts