inspiration

మనం చేసిన సహాయం… ఏదో ఒక రూపంలో నిన్ను వెతుకుంటు వస్తుంది అని చెప్పడానికి వీళ్ళ కథే ఒక ఉదాహరణ..!

ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటుంటే ఏవో అరుపులు వినిపించాయి.వెంటనే అటు వైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడి HELP, HELP అని అరుస్తూ ఉంటాడు, రైతు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బావిలో దూకి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు.తర్వాతి రోజు వాళ్ళింటి ముందు ఒక ఖరీదయిన గుర్రపుబండి వచ్చి ఆగుతుంది, అందులో నుండి ఖరీదయిన దుస్తులు ధరించిన పెద్ద మనిషి దిగి నేరుగా రైతు వద్దకు వస్తాడు,ఎవరు బాబు మీరు?? ఎవరు కావాలి?? అని అడుగుతాడు రైతు. నమస్తే, నేను పక్క వూర్లో ఉంటాను, నిన్న మీరు మా అబ్బాయిని బావిలో పడిపోతే రక్షించారు, అందుకు కృతజ్ఞతగా ఏమిచ్చినా మీ ఋణం తీరదు, దయచేసి ఈ ధనం తీసుకోండి అంటూ ఒక ఇనప్పెట్టె ఇస్తాడు. అప్పుడు రైతు క్షమించండి, నేను ప్రతిఫలం ఆశించి చేయలేదు, ఒక వ్యక్తి ఆపదలో ఉంటే నా చేతనయిన సాయం చేసాను, అది మనిషిగా నా ధర్మం, అంటూ సున్నితంగా తిరస్కరిస్తాడు.

ఇంతలో ఆ రైతు కొడుకు అక్కడికి వచ్చి పెద్ద మనిషికి నమస్కరిస్తాడు….ఈ అబ్బాయి నీ కొడుకా?? ఏం చదువుతున్నాడు?? అని అడుగుతాడు పెద్దమనిషి. అవునండి నా కొడుకే, కొంతవరకు చదివించాను, ఇక చదివించే స్తోమత లేదు, ఇపుడు నాతో పాటే పొలానికి వచ్చి పనుల్లో సాయపడుతుంటాడు అంటాడు రైతు. అలాగా, అయితే నా మాట విను, నీ కొడుకుని నేను చదివిస్తాను, నా కొడుకుతో పాటు పెద్ద చదువులు చదువుకుంటాడు, ఖర్చంతా నేను భరిస్తాను. నా మాట కాదనకు, నా కొడుకుని కాపాడిన నీ ఋణం కొంతయినా తీర్చుకోనివ్వు అంటాడు. ఆ పెద్ద మనిషి అంతలా అడుగుతుంటే కాదనలేక సరే అంటాడు రైతు.

alexander fleming and winston churchill do you know the story

పెద్ద మనిషి పిల్లలిద్దరిని పెద్ద చదువులు చదివిస్తాడు, వాళ్ళిద్దరూ చాలా గొప్ప వాళ్ళు అవుతారు.కొంతకాలానికి ఆ పెద్ద మనిషి కొడుక్కి ఒక అంతు తెలియని వ్యాధి వస్తుంది, డాక్టర్లు అందరూ అతన్ని పరీక్షించి చేతులెత్తేస్తారు, అప్పుడు ఆ రైతు కొడుకు వచ్చి తను కనిపెట్టిన మందుతో ఆ వ్యాధిని నయం చేస్తాడు.ఆ రైతు కొడుకు ఎవరో తెలుసా??పెన్సిలిన్ మందుని కనిపెట్టి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త Alexander Fleming..!!! ఇంతకు ఆ రెండో వ్యక్తి ఎవరో తెలుసా?? బ్రిటీష్ మాజీ ప్రధాన మంత్రి Winston Churchil అందుకే అంటారు పుణ్యం వూరికే పోదు, కలకాలం తోడొస్తుంది అని.!!

Admin

Recent Posts