inspiration

దేవుడు నాతో చేయించిన ప‌ని! నిజంగా అద్భుత‌మే.!!!

మా ఫ్రెండ్ కి 10 వేలు ఇవ్వాల్సి ఉంది, ఆరోజు డ‌బ్బులు ఉండ‌డంతో అత‌ని అకౌంట్లో వేశాను. పొర‌పాటున అవి వేరే వారి అకౌంట్ లోకి వెళ్లాయి.! మాఫ్రెండ్ ఫోన్ చేసి ఇంకా డ‌బ్బులు వేయ‌లేదా? అని అడిగాడు అప్పుడు తేరుకొని బ్యాంక్ కు వెళ్లి ఆరా తీస్తే కానీ తెలియ‌లేదు…ఆ డ‌బ్బులు వీడి అకౌంట్ కి బ‌దులు వేరే అకౌంట్ కి ట్రాన్ఫ‌ర్ అయ్యాయ‌ని….! బ్యాంక్ మేనేజ‌ర్ తెలిసిన వాడే అవ్వ‌డంతో..ఆ డ‌బ్బులు తిరిగొచ్చే మార్గం అడిగాను..దానికి అత‌ను …అమౌంట్ క్రెడిట్ అయిన అత‌ని అడ్ర‌స్ ఇచ్చి…అత‌ని ద‌గ్గ‌రి నుండి తీసుకోవ‌డం త‌ప్ప వేరే మార్గం లేదు అన్నాడు.

దాంతో అడ్ర‌స్ ప‌ట్టుకొని అత‌నుండే చోటుకు వెళ్లాను… అత‌ని గురించి వాక‌బు చేశాను…ఓహ్ సురేష్..ఆ… చాలా మంచి కుర్రాడు, కాలేజ్ కు వెళ్లాడు ., సాయంత్రం హోమ్ ట్యూష‌న్స్ చెబుతూ, ఉద‌యం కాలేజ్ కు వెళ‌తాడు, అత‌డికి త‌ల్లిదండ్రులు లేరు! అని అత‌ని గురించి చాలా గొప్ప‌గా చెప్పారు! కాలేజ్ డీటైల్స్ తెలుసుకొని డైరెక్ట్ గా కాలేజ్ కే వెళ్ళాను.!

god did this to me but i really appreciate it

బాబూ ఇక్క‌డ సురేష్ మీకు తెలుసా? అని అడిగాను…వెంట‌నే ఆకాలేజ్ లో క‌ట్టిన ఫ్లెక్సీ చూపిస్తూ..ఈ సురేష్ యేనా.? అని అడిగాడు, ఓ కుర్రాడు. అది కాలేజ్ టాప‌ర్స్ ను క‌వ‌ర్ చేస్తూ వేయించిన ఫ్లెక్సీ.! ఈ సురేష్ అయితే డిగ్రీ ఫైన‌ల్ ఇయ‌ర్…సెకండ్ ఫ్లోర్ , రూమ్ నెంబ‌ర్ 102 లో ఉంటాడు అని చెప్పాడు.

అత‌నుండే రూమ్ కి వెళ్లి సురేష్…అంటే నువ్వేనా అని అడిగాను. ఆ అవునండీ…అంటూ న‌న్ను కొత్త‌గా చూశాడు. గ‌తంలో చూడ‌ని ముఖం కాబ‌ట్టి…నేనొచ్చిన విష‌యం చెప్పాను, వెంట‌నే సారీ సార్ అంటూ న‌న్ను హ‌గ్ చేసుకున్నాడు.! సార్ నాకు ఫోన్ లేదు, నా అకౌంట్ కి మా ఫ్రెండ్ నెంబ‌ర్ లింక్ చేశాను…నిన్న‌నే నా ఎగ్జామ్ ఫీజ్ లాస్ట్ డేట్, నాద‌గ్గ‌ర డ‌బ్బులు లేవు, దేవుడికి దండం పెట్టుకొని కాలేజ్ కు వెళ్లాను.. మా ఫ్రెండ్ క‌లిసి అరే నీ అకౌంట్ లో 10 వేలు క్రెడిట్ అయ్యాయని చెప్పాడు.. ఎవ‌రివి? ఎక్క‌డివి? ఎలా వ‌చ్చాయ్? ఎందుకొచ్చాయ్? అని ఆలోచించ‌కుండా ఆ..డ‌బ్బులు డ్రా చేసి ఎగ్జామ్ ఫీజ్ క‌ట్టాను.! ఫ్లీజ్ సార్…నాకు కొన్ని రోజులు టైమ్ ఇవ్వండి వ‌డ్డీతో స‌హా మీ డ‌బ్బులు మీకిచ్చేస్తా అన్నాను.! ఒక‌వేళ డ‌బ్బులు నీ అకౌంట్ లోకి రాకుంటే అని అడిగాను… చ‌దువు మానేద్దామ‌నుకున్నాను సార్ అని స‌మాధాన‌మిచ్చాడు.! నేను తెలియ‌క త‌ప్పుచేశానా? లేక ఆ దేవుడే నాతో ఈ త‌ప్పు చేయించాడా? అని ఆలోచించుకుంటూ…ఇంటికొచ్చేశా…! బ‌ట్ ఫైన‌ల్ గా దేవుడు కావాల‌నే నాతో ఈ త‌ప్పు చేయించి ఓ మంచి ప‌నిచేయించాడ‌నిపించింది.! మ‌ళ్లీ ఇంత వ‌ర‌కు అత‌డిని ఆ డ‌బ్బులు అడ‌గలేదు.!

Admin

Recent Posts