inspiration

బొద్దింక కథ.. జీవితాన్ని మార్చేసిన సత్యం..

ఒకసారి గూగుల్ CEO సుందర్ పిచాయ్ తన స్నేహితులతో కలిసి ఓ హోటల్‌లో కూర్చున్నారు. ఆ టేబుల్ పక్కనే ఇద్దరు యువతులు నవ్వుతూ, మాట్లాడుకుంటూ హాయిగా కూర్చున్నారు. అయితే అప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన ఓ బొద్దింక ఒక్కసారిగా ఆ యువతుల్లో ఒకరిపై పడింది.
ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురై అరిచి, గగ్గోలు పెట్టి, గాలిలోకి ఎగిరేసి దాన్ని తన్నేసింది. ఆ బొద్దింక తిరిగి మరో అమ్మాయిపై పడింది – అదే గోల, అదే భయం, అదే హడావిడి! చివరికి ఆ బొద్దింక ఒక సర్వర్ మీద పడింది. అయితే అతనేమి చేసాడు? ఎలాంటి అణకువలేకుండా, ఎలాంటి గందరగోళం లేకుండా… ఆ బొద్దింకను ప్రశాంతంగా పట్టుకుని, నెమ్మదిగా కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు వదిలేశాడు.

ఇంత చిన్న సంఘటనే సుందర్ పిచాయ్ జీవితాన్ని మార్చేసింది. అతను తన లోపల ఆలోచించుకున్నాడు: ఈ అంతా హడావుడికి అసలు కారణం బొద్దింకేనా? అది బొద్దింక కదా… కానీ ఎందుకు ఈ ఇద్దరు అమ్మాయిలు భయపడ్డారు, కానీ సర్వర్ మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు? అక్కడే నిజం బయటపడింది… సమస్య బొద్దింక కాదు. సమస్యను చూచే మన దృష్టికోణం – అదే అసలైన కారణం! అదే సత్యం మన జీవితానికి కూడా వర్తిస్తుంది. నాన్న గాని, బాస్ గాని, భార్య గాని – మన మీద అరవడమే మన కోపానికి కారణం కాదు. మనలో ఆ కోపాన్ని కంట్రోల్ చేయలేకపోవడమే అసలైన సమస్య. రోడ్డుమీద ట్రాఫిక్‌ జామ్ కారణంగా మనకి అసహనం రావడం కాదు… అలాంటి పరిస్థితిలో మనం మనసును నిలుపుకోలేకపోవడమే నిజమైన ఇబ్బంది.

story of a cockroach incident inspiration to sundat pichai

జీవితం గందరగోళంగా మారిపోవడానికి కారణం – సమస్యలు కావు. మన స్పందనే అసలైన సమస్య. ఈ కథ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. స్పందించవద్దు – అధిగమించండి. భయపడవద్దు – ఆలోచించండి. నిగ్రహంతో ప్రతి సమస్యను ఎదుర్కొనండి. బొద్దింకను చూసిన వారు భయపడ్డారు. కానీ అదే సమస్యను సర్వర్ ప్రశాంతంగా పరిష్కరించాడు. స్పందనలు ఎప్పుడూ ఉద్రేకంతో కూడి ఉంటాయి. అధిగమించడం మాత్రం నిశ్చల ఆలోచనల ఫలితం. ఇది అర్థం చేసుకున్నప్పుడే జీవితం సులభంగా అనిపిస్తుంది. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే, అతని జీవితం ముసలిపోయేలా సజావుగా సాగుతోందన్న అర్ధం కాదు… కాని ఎదురైన ప్రతి పరిస్థితిని సరైన మనోభావంతో చూసే కళ్లుండడం – అదే నిజమైన విజయ రహస్యము! ఇప్పుడు మీరు స్పందిస్తారా? లేక సమస్యను అధిగమిస్తారా? జీవితం నడిచే దారిని మీరు ఎంచుకోవచ్చు.

Admin

Recent Posts