international

భార‌త సీక్రెట్ స‌ర్వీస్‌కు ప‌ట్టిన చీడ పురుగు.. ఇంతకీ అస‌లు ఏం చేశాడు..?

రవీంద్ర సింగ్.. దేశ సీక్రెట్ సర్వీస్ చరిత్రలో అతిపెద్ద దేశద్రోహి.. దేశంలోని ప్రజలను వ్యక్తిగత లగ్జరీ కోసం అమెరికాకు అమ్మేశాడు.. రా RAW ( ది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ) భారతదేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మన దేశానికి కన్ను లాంటిది.. విదేశీ గడ్డ మీద రా అధికారుల ధైర్యం సాహసం తెలివితేటలు విద్యుత్ వేగంతో స్పందించే వేగానికి అది పెట్టింది పేరు.. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలలో మొదటి 3 స్థానాల్లో ఒకటి… కానీ రా చరిత్రలో కూడా కొన్ని చీకటి అధ్యాయాలు కూడా ఉన్నాయి.. భారత ఇంటిలిజెన్స్ వ్యవస్థల్లో డబుల్ ఏజెంట్స్ గా దేశానికి ద్రోహం చేసిన వ్యక్తులు చాలా తక్కువ..కానీ ఇలాంటి దేశద్రోహానికి పాల్పడిన వ్యక్తి ఒకత‌ను ఉన్నాడు.. అత‌నే రవీంద్ర సింగ్.. ఇత‌ను రా చరిత్రలోనే అతిపెద్ద దేశద్రోహి.. ఏజెన్సీ యొక్క నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయడమే కాక, భారతదేశం యొక్క జాతీయ భద్రతమీద తీవ్రమైన దెబ్బ తీసిన వ్యక్తి..

రవీంద్ర సింగ్ చాలా అరుదైన స్పై శిక్షణ పొందాడు.. ఇత‌ను 1980 లలో ఏజెన్సీలో చేరాడు..విదేశీ భాషలపై అతని పట్టు అలాగే అతని షార్ప్ ఇంటిలిజెన్స్ వల్ల అత్యున్నత అధికారుల కళ్ళలో పడ్డాడు..అతన్ని అన్ని విధాలా పరీక్షించిన తర్వాత అతనికి క్లిష్టమైన బాధ్యతలను అప్పగించారు.. అత‌డిని విదేశాలలో ప్రతి భారతీయ రాయబార కార్యాలయాలకు అటాచ్ చేశారు.. అతనికి అత్యంత సున్నితమైన సమాచారానికి కూడా యాక్సిస్ కల్పించారు.. తర్వాత మొత్తం ఐరోపాలో రా స్టేషన్ చీఫ్‌గా నియమించబడ్డాడు.. ఈ స్థానం చాలా విశ్వసనీయ అధికారులకు మాత్రమే ఇస్తారు..ఈ స్థానంలో ఉన్న వ్యక్తికి నేరుగా రా చీఫ్ తో పాటు ప్రధాని..హోమ్ మినిస్టర్..డిఫెన్స్ మినిస్టర్ లతో హాట్ లైన్ యాక్సిస్ ఉంటుంది..ఆ సమయంలో, ఫ్రాన్స్ .. ఆఫ్ఘన్..పాక్.. నేపాల్ లలో నేరుగా తన ఏజెంట్స్ ను నియమించుకునే వెసులుబాటును భారత్ కల్పించింది..

ex raw officer ravinder singh dark side

ఇక్కడి నుంచే అత‌డి అవినీతి ..దేశద్రోహం..లగ్జరీ జీవితం కోసం దేశాన్ని సైతం అమ్మేసే గుణం బయటపడింది.. కౌంటర్ ఇంటిలిజెన్స్ లో భాగంగా ఇతని మీద ఒక ఏజెంట్ కు అనుమానం వచ్చింది..పై అధికారులకు తెలిస్తే అప్రూవల్ రాదని తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా విశ్వనాధ్ సింగ్ అనే జూనియర్ ఏజెంట్ ఇతడి ఇంట్లో ఆఫీస్ లో ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ గాడ్జెట్స్ రహస్యంగా అమర్చాడు.. ఫోన్స్ టాప్ చేశాడు.. అతని జిరాక్స్ మిషన్ కు రిమోట్ క్లోన్ డివైస్ ఇన్స్టాల్ చేసి అతను స్కాన్ చేసిన ప్రతి డాక్యుమెంట్ వేరే చోట కూడా ప్రింట్ అయ్యే విధంగా ఏర్పాటు చేశాడు.. కొద్దిగా క్లూ దొరికింది నాటి రా చీఫ్ PK హోర్మీస్ తర్కణ్ ( కేరళ క్యాడర్ IPS ) విశ్వనాద్ ను గో ఏ హెడ్ అన్నారు.. మొత్తం 20 మంది ఏజెంట్స్ తో షాడో టీం ఏర్పాటయింది.. కేవలం 16 రోజుల్లో, సింగ్ 210 కి పైగా అత్యంత రహస్య నివేదికలను కాపీ చేసాడు..ఇందులో ఆఫ్ఘనిస్తాన్.. పాకిస్తాన్, దక్షిణ ఆసియాలో రా యొక్క వ్యూహాల గురించి సున్నితమైన వివరాలు ఉన్నాయి..

ఇదే సమయంలో సింగ్ తన కుమార్తె నిశ్చితార్థానికి హాజరు కావాలని పేర్కొంటూ సెలవు కోసం అప్లై చేశాడు..అప్పటికే అతనికి తనమీద సర్వైలెన్స్ పడిందని అర్ధం అయింది..అతను తప్పించుకోవడానికి ప్లాన్ ముమ్మరం చేశాడు.. మే 1, 2004 న, రవీంద్ర సింగ్ అతని భార్య పర్మిందర్ కౌర్ తో సహా కారులో నేపాల్‌లోకి ప్రవేశించారు. నేపాల్ లో అత‌డు నేపాల్ గంజ్ లో CIA కాంటాక్ట్ డేవిడ్ తో సమావేశమయ్యాడు .. అక్కడి నుండి ఖాట్మండుకు వెళ్లారు. నకిలీ గుర్తింపులను ఉపయోగించి రామ్ ప్రసాద్ శర్మ & దీపా జుమార్ శర్మ ల పేరుతో యు.ఎస్. రాయబార కార్యాలయం నుండి పాస్‌పోర్ట్‌లు అందుకున్నారు.. మే 7 న, ఈ జంట ఆస్ట్రియన్ ఎయిర్లైన్స్ విమానంలో వాషింగ్టన్ డి.సి.కి పారిపోయారు.. అన్నీ కళ్ల ముందే కనబడుతున్నా ఏ ఒక్క ఆధారం కూడా అతన్ని ఇమ్మీడియట్ అరెస్ట్ కు హెల్ప్ చేయలేదు..( పైగా రా లోని ఒక సీనియర్ అధికారి అతనికి అండగా నిలబడ్డాడు.. తర్వాత కాలంలో అత‌డే రా ఛీఫ్ అయ్యాడు..)

అత‌డి ఇంట్లో దొరికిన ఒక పాత లాప్ టాప్ ఆధారంగా అత‌డి మెయిల్స్ లిస్ట్ మాత్రం బయటకి తీయగలిగారు.. అత‌డ్ని 2005 లో ఆర్టికల్ 311 (2) (సి) ప్రకారం ఉద్యోగం నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు.. అత‌డు కేవలం ఉద్యోగం నుంచి మాత్రమే తొలగించబడ్డాడు.. నో కేసెస్.. అతనిపై పబ్లిక్ క్రిమినల్ కేసు దాఖలు చేయలేదు.. ఇది బయటపడితే స్వంత ఏజెన్సీలోనే ఉన్న దేశద్రోహులను డబల్ ఏజెంట్స్ ను భారత్ గుర్తించలేక పోయిందని ప్రపంచ దేశాల్లో అవమానం, చులకన కూడా అవుతాం అని ప్రభుత్వం కేసులు పెట్టలేదు.. 2014 లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏజెన్సీస్ లో ఉన్న డబల్ ఏజెంట్స్ నూ..దేశానికి ద్రోహం చేసి విదేశాల్లోకి పారిపోయిన వాళ్ళ లిస్ట్ ను తయారు చేశారు.. ఆ లిస్ట్ లో మాజీ ఉపరాష్ట్రపతి పేరుతో పాటు ఇత‌డి పేరు కూడా మొదటి లో ఉంది.. 2016 చివరలో USA లో జరిగిన అనుమానాస్పద రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. (అర్థం అయిందా) .

Admin

Recent Posts