international

పాక్ వ‌దిలాక ఫెయిలై భార‌త్‌లో ప‌డిన క్షిప‌ణులు.. ప‌రీక్షించేందుకు జపాన్ కే మొదటి అవకాశం..

పాకిస్తాన్ ప్రయోగించిన చైనా నుంచి దిగుమతి చేసిన PL 15E క్షిపణులను, భారత్ EW jamming చేయడం వల్ల అవి దెబ్బ తినకుండా దొరికాయి. స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లోని ప‌లు చోట ఇలాంటి ఫెయిలైన క్షిప‌ణుల‌ను ఇప్ప‌టికే భార‌త ఆర్మీ రిక‌వ‌రీ చేసింది. ఈ క్షిప‌ణుల‌ను ప‌రీక్షించ‌డం ద్వారా వాటి పూర్తి వివ‌రాలు తెలియ‌నున్నాయి. క్షిప‌ణిని ఎలా త‌యారు చేశారు, దాని డిజైన్ ఏంటి.. ఎలా ప‌నిచేస్తుంది వంటి అంశాల‌ను ఈ ప‌రీక్ష ద్వారా తెలుసుకుంటారు.

Critical systems అయినా electronic counter – counter measures module, guidence software, propulsion system , inertial reference unit, data link, AESA radar seeker లు దెబ్బతినకుండా దొరికాయి. ఈ క్షిపణి కి సంబంధించిన వేరే వెర్షన్ చైనా తన 5th gen యుద్ద విమానాలలో ప్రధాన BVR క్షిపణిగా వాడుతుంది. క‌నుక సహజంగా ఇతర దేశాలలో ఈ ఫెయిలైన క్షిప‌ణిని పరిశీలించాలి అన్న ఉత్సాహం కనబరిచాయి.

pakistan failure missile which landed in india should be tested by japan

ముందుగా జపాన్ కి చెందిన రాడార్ మరియు ఎలెక్ట్రానిక్ warfare బృందం వీటిని పరీక్షించనుంది. దీంతో పాక్ పంపిన PL 15E క్షిపణుల అస‌లు బాగోతం తెలియ‌నుంది. అయితే ఇది చైనాకు పెద్ద దెబ్బే అవుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. దీని వ‌ల్ల చైనా క్షిప‌ణుల సాంకేతిక‌త‌ను అర్థం చేసుకునే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని చెబుతున్నారు.

Admin

Recent Posts