ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్‌కు మన బలం ఎమిటో తెలిసొచ్చింది. భారత ఆర్మీ కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగిపోయిన పాక్ వెంటనే అమెరికా వద్ద మోకరిల్లింది. బాబోయ్ యుద్దం వద్దు, భారత్‌ను ఎలాగైనా ఒప్పించండి అంటూ వేడుకుంది. దీంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే పాకిస్థాన్‌పై భారత్ యుద్ధం చేసిన తీరుకు ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ముఖ్యంగా అమెరికా, చైనా, టర్కీ నుంచి తెచ్చుకున్న పాక్ డ్రోన్లను, మిస్సైల్స్‌ను భారత్ తుత్తునియలు చేసింది. దీంతో భారత యుద్ధ సామగ్రికి డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే భారత్ వద్ద ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలు ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఏయే దేశాల వద్ద ఎలాంటి ఫైటర్ జెట్లు ఉన్నాయో, వాటి ధర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికా వద్ద ఎఫ్ 22 రాప్టర్ ఫైటర్ జెట్ ఉండగా ఇది 5వ జనరేషన్ ఫైటర్ జెట్‌గా పేరుగాంచింది. దీని ఖరీదు సుమారుగా రూ.1600 కోట్లుగా ఉంది. ఈ యుద్ధ విమానాలను అమెరికా ఎవరికీ అమ్మడం లేదు. కేవలం ఆ దేశం వద్దే ఉన్నాయి. అలాగే అమెరికా వద్దే ఉన్న 5వ జనరేషన్ ఫైటర్ జెట్ అయిన ఎఫ్ 35 లైటెనింగ్ 2 జెట్ కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని ఖరీదు సుమారుగా రూ.900 కోట్ల వరకు ఉంటుంది. తరువాతి స్థానంలో రష్యాకు చెందిన సు-57 ఫెలాన్ అనే యుద్ధ విమానం నిలుస్తుంది. ఇది కూడా 5వ జనరేషన్ ఫైటర్ జెట్. దీని ధర సుమారుగా రూ.700 కోట్ల వరకు ఉంటుంది.
చైనా వద్ద జె-20 మైటీ డ్రాగన్ అనే 5వ జనరేషన్‌కు చెందిన ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటి ధర సుమారుగా రూ.1000 కోట్ల వరకు ఉంటుంది. ఫ్రాన్స్ వద్ద డసాల్ట్ రాఫెల్ అనే 4, 5వ జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటినే మనకు కూడా విక్రయిస్తున్నారు. ఒక్కో రాఫెల్ యుద్ధ విమానం ఖరీదు దాదాపుగా రూ.900 కోట్ల వరకు ఉంటుంది. యూకే, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి యురోపియన్ దేశాల వద్ద యూరో ఫైటర్ టైపూన్ అనే 4, 5వ జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటి ధర ఒక్కొక్కటి సుమారుగా రూ.1000 కోట్ల వరకు ఉంటుంది. అమెరికా వద్ద 4వ జనరేషన్‌కు చెందిన ఎఫ్-15ఈఎక్స్ ఈగిల్ 2 అనే ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి. ఒక్కో దాని ధర రూ.800 కోట్ల వరకు ఉంటుంది.
అమెరికా వద్ద ఎఫ్/ఎ-18ఇ/ఎఫ్ సూపర్ హార్నెట్ అనే 4, 5వ జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి. వీటిని సామగ్రి తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్నారు. ధర ఒక్కోటి రూ.600 కోట్లుగా ఉంది. స్వీడన్ వద్ద సబ్ జేఏఎస్ 39 గ్రైపెన్ ఇ/ఎఎఫ్ అనే 4, 5వ జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటి ఖరీదు రూ.500 కోట్లుగా ఉంది. భారత్ వద్ద 4వ జనరేషన్‌కు చెందిన హెచ్ఏఎల్ తేజస్ ఎంకే-1ఎ అనే ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటి ధర ఒక్కొక్కటి సుమారుగా రూ.400 కోట్లుగా ఉంది.