international

5వ త‌రం ఫైట‌ర్ జెట్స్‌ను ర‌ష్యాతో క‌లిసి భార‌త్ త‌యారు చేస్తుందా..?

ర‌ష్యా తమ 5th generation fighter plane SU57 ని భారత్ కి ఆఫర్ చేసింది. ఇందులో కొత్త ఏముంది? తమ యుద్ద విమానం source codes కూడా ఇస్తాము అని చెబుతుంది. అలాగే, లోకల్ ప్రొడక్షన్ కావాలి అంటే, నాసిక్ లో SU 30 mki విమానాలు తయారు చేసే కేంద్రానికి కొన్ని మార్పులు చేస్తే ఒక్క సంవత్సరం లోనే SU 57 తయారు చేసేందుకు సిద్ధం చేయవచ్చు అని అంటున్నారు. 40 నుంచి 60 విమానాలు తీసుకునే అవకాశాన్ని , అది కూడా డైరెక్ట్ గా కొనాలా? లోకల్ ప్రొడక్షన్ చెయ్యాలా? లాంటి వివరాలు రక్షణ శాఖ, IAF సంప్రదింపులు జరిపి 6 వారాలలో ఒక నిర్ణయానికి రావాలి అని చూస్తున్నట్టు అనధికార వార్త.

మరొక పక్క, పాకిస్తాన్ , చైనా నుంచీ 40 J35A ఐదవ తరం యుద్ద విమానాలని సగం ధరకి కొనుగోలు చేసే పనిలో ఉంది. ఇక ర‌ష్యాతో మనం ఈ ప్రోగ్రామ్ లో పూర్వం భాగస్వాములం. R & D లో భాగం అవ్వాలని పెట్టుబడి కూడా పెట్టాము మనం నేర్చుకోవచ్చు అని.

will india make 5th gen fighter jets with russia

కానీ, airframe డిజైన్ విషయం లో మనకి నేర్చుకునే అవకాశం ఇవ్వకుండా, ఈ పాటికే మేము airframe డిజైన్ పూర్తి చేశాము అని….ఇలా చాలా technology transfer విషయంలో ఆశించిన సహకారం మనకి అందించలేదు. మన IAF pilot లు test flight చేయడానికి ఒక సందర్భం లో అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ తరువాత మనవారు పరీక్షించి దానిలో చాలా లోపాలు ఉన్నాయి అని , ఐతే వాటిని సవరించే ప్రక్రియలో మమ్మలి భాగస్వాములు చేసుకుని tech transfer ఇవ్వాలి అని లేదా మేము మిగతా పెట్టుబడి పెట్టకుండా బయటకి వస్తామని చెప్పి బయటకి వచ్చాము.

ఇప్పుడు కూడా ముఖ్యమైన టెక్నాలజీ ఇవ్వాలని రష్యా అనుకోవడం లేదు కానీ, source codes ఇవ్వడం వల్ల , రష్యా తో చాలా వరకూ సంబంధం లేకుండా మనకి నచ్చిన ఆయుధాలు, equipment దానికి అమర్చి నచ్చిన విధం గా upgrade చేసుకోవచ్చు. వాటిని నమూనాగా తీసుకుని మనం AMCA యుద్ద విమానాల ప్రోగ్రామ్ కి మెరుగులు దిద్దుకోవచ్చు అన్నది ఒక ఆలోచన. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Admin

Recent Posts