lifestyle

ఆ వ‌ర్గానికి చెందిన వారు పాటించే ఆచారం తెలిస్తే దుమ్మెత్తి పోస్తారు..!

భారతదేశమంటేనే భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. వీరిలో కొందరి మూలాలు మన దేశంలోనే ఉంటే ఇంకొందరి మూలాలు ఇతర దేశాల్లో ఉంటాయి. అయితే అలాంటి ఇతర దేశాల మూలాలు కలిగిన వర్గాల్లో దావూదీ బోరా వర్గం కూడా ఒకటి. . ఈ వర్గం వారు ఎక్కువగా ఈజిప్ట్, యుథోపియా, ఇండోనేషియా ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు. కాగా వారిలో కొందరు కొన్ని శతాబ్దాల కిందటే భారతదేశానికి వలస వచ్చారు. అయితే ఆయా దేశాల్లో ఉన్నవారు గానీ, ఇక్కడ మన దగ్గర ఉన్న దావూదీ బోరా వర్గీయులు కానీ పురాతన కాలం నుంచి ఒక ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు.

దావూదీ బోరా వర్గీయులు పాటిస్తున్న ఆ ఆచారం గురించి చెప్పడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ తెలుసుకోక తప్పదు. ఇంకా ఇలాంటి ఆచారాలు పాటిస్తున్నారా? అని నలుగురికీ తెలియడం కోసమే మా ఈ ప్రయత్నం. 6 నుంచి 9 సంవత్సరాల మధ్య వయస్సున్న దావూదీ బోరా ఆడపిల్లలకు ఖత్నా(సున్తీ) అనే కార్యక్రమం నిర్వహిస్తారట. దీన్ని ఫీమేల్ జెనిటల్ మ్యుటిలేషన్ (ఎఫ్‌జీఎం) అని కూడా పిలుస్తారు. ఆ వయస్సులో ఉన్న ఆడపిల్లల క్లైటోరిస్ (యోని శీర్షం)లో కొంత భాగాన్ని బ్లేడ్ సహాయంతో తీసేస్తారు.

dawoodi bohra community people still following that tradition

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దావూదీ బోరా వర్గీయుల్లో ఇప్పటి వరకు దాదాపు 20 కోట్ల మంది మహిళలకు ఈ తరహా ఆచారాన్ని నిర్వహించినట్టు తెలిసింది. మన దగ్గర ఉన్న ఈ వర్గం వారు కూడా ఇప్పటికీ కొన్ని చోట్ల దీన్ని పాటిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ ఆచారాన్ని పాటించడం వెనుక ఉన్న అసలు కారణం మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు.అయితే పురుషులలో ఈ ఆచారం చాలా తెగల్లో ఉన్నప్పటికీ …..పురుషుల విషయానికి వచ్చేసరికి సున్తీ చాలా మంచింది. ఇది వారి లైంగిక సామార్థ్యాన్ని పెంచుతుంది, జననాంగ అవయవాల దగ్గర శుభ్రతకు సహాయపడుతుంది. కానీ స్త్రీలలో ఈ రకమైన సున్తి వల్ల మాత్రం ఎటువంటి లాభాలు లేకపోగా..అనర్థాలకు దారితీసే పరిస్థితులే ఎక్కువ అంటున్నారు వైద్యులు.

Admin

Recent Posts