ఇంటి పనులు సాధ్యమైనంత వరకు ఉదయాన్నే ముగించేస్తారు కొంతమంది. మరికొందరేమో సాయంత్రం వరకు పొడిగిస్తూ ఉంటారు. ఉద్యోగరీత్యానో, ఇతర పనుల కారణంగానో ఉదయం కాకుండా సాయంత్రం వేళల్లో ఇంటి పనులు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా బట్టలు కూడా కొంతమంది సాయంత్ర వేళల్లోనే ఉతుకుతారు. అలా చేయడం మంచిది కాదంటున్నారు పండితులు. బట్టలు ఉతికే కార్యక్రమం పొద్దున లేదా మధ్యాహ్నం లోపలే ముగించేయాలని వారు చెబుతున్నారు.
ఇప్పుడు చాలా మందికి వాషింగ్ మెషిన్లు ఉంటున్నాయి. దీంతో ఏ సమయంలో పడితే ఆ సమయంలో బట్టలు ఉతుకుతున్నారు. చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కనుక వాషింగ్ మెషిన్‌లో బట్టలు ఉతుకున్నారు. కానీ బట్టలను ఏ విధంగా ఉతికినా సరే సాయంత్రం సమయం ఆ తరువాత మాత్రం బట్టలను ఉతక కూడదని పండితులు చెబుతున్నారు. అలా చేస్తే ఇంట్లో అరిష్టం కలుగుతుందట. అన్నీ అశుభాలే కలుగుతాయని వారు అంటున్నారు.
సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతికితే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుందట. అందుకే బట్టలు ఉదయాన్నే ఉతకాలని వారు సూచిస్తున్నారు. సూర్యాస్తమయం అయిన తరువాత దుస్తులను ఉతికితే ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించడంతోపాటు ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇంట్లో దోషం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య కలహాలు వస్తాయి. కనుక మీకు వాషింగ్ మెషిన్ ఉన్నా లేకపోయినా దుస్తులను మాత్రం ఉదయం లేదా మధ్యాహ్నం సమయాల్లో ఉతకడం మంచిది. దీంతో ఇబ్బంది లేకుండా ఉంటుంది.