lifestyle

షేవింగ్ బ్లెడ్స్ ఇదే ఆకారంలో ఎందుకు ఉంటాయి ? దీని వెనకున్న కథ ఇదేనా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన నిత్య జీవితంలో బ్లేడ్ కూడా ఓ భాగమైపోయింది&period; మనిషి పుట్టిన నుంచి చనిపోయే వరకు కచ్చితంగా బ్లేడ్‌ అవసరం ఉంటుంది&period; అయితే… మనం పుట్టిన ప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే ఆకారంలో ఉంది ఈ బ్లేడ్‌&period; ఇంత వరకు దానికి ఆకారం గానీ&comma; పరిమాణం కానీ పెరగలేదు&period; తగ్గలేదు&period; అయితే&period;&period; అలా ఎలా జరిగిందనే దానిపై ఇవాళ ఆసక్తి కర విషయాలు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్లేడ్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది జిల్లెట్ కంపెనీ&period; నిజానికి బ్లేడ్స్ ను తొలిసారి రూపొందించింది ఇదే కంపెనీ&period; 1901 లో తొలిసారి జిల్లెట్ కంపెనీ బ్లేడ్ ను తయారు చేసింది&period; అయితే అప్పుడు బ్లేడ్ ప్రస్తుతం ఉన్న ఆకారంలో కాకుండా&comma; మూడు హోల్స్ తో రేజర్ లో కదలకుండా ఫిట్ గా ఉండేలా రూపొందించారు&period; జిల్లెట్ ఈ డిజైన్ మీద పేటెంట్ తీసుకోవడంతో 20 ఏళ్ల పాటు జిల్లెట్ డిజైన్ లో ఎవరు బ్లేడ్లను తయారు చేయలేని పరిస్థితి ఏర్పడింది&period; ఇక 20 ఏళ్ల తర్వాత 1921లో పేటెంట్ ముగియడంతో చాలా కంపెనీలు బ్లేడ్స్ ను తయారు చేయడం ప్రారంభించాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83887 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;blades&period;jpg" alt&equals;"do you know these facts about shaving blades " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే సమయంలో జె హేన్రి అనే పారిశ్రామికవేత్త ప్రోబ్యాక్ పేరుతో రేజర్ల తయారీని ప్రారంభించాడు&period; అయితే హేన్రి తయారు చేసే బ్లేడ్స్ పై అప్పటివరకు ఉన్న మోడల్ కాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజైన్ ను తయారు చేశాడు&period; దీంతో ప్రో బ్యాక్ కంపెనీకి చెందిన బ్లేడ్స్&comma; జిల్లేట్ కు చెందిన రేజర్లలో సరిపోయేవి&period; కానీ జిల్లేట్ కంపెనీ బ్లేడ్స్ ప్రో బ్యాక్ రేజర్ లో సరిపోయేవి కావు&period; దీంతో ప్రో బ్యాక్ కంపెనీ రేజర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి&period; దీంతో జిల్లేట్ కంపెనీకి నష్టం వచ్చింది&period; కాలక్రమేనా అన్ని కంపెనీలు ప్రో బ్యాక్ డిజైన్ ను ఫాలో అవుతూ వచ్చాయి&period; దీంతో ప్రస్తుతం ఈ డిజైన్స్ స్థిరపడింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts