lifestyle

జీవిత స‌త్యాన్ని తెలిపే కాక్ రోచ్ (బొద్దింక‌) థియ‌రీ.. త‌ప్ప‌క చ‌ద‌వండి..

ఓ రెస్టారెంట్ లో న‌లుగురు భోజ‌నం చేస్తున్నారు. ఇంత‌లో అందులోని ఓ మ‌హిళ మీద బొద్దింక ప‌డింది, ఆ బొద్దింక‌ను చూసి ఆ మ‌హిళ చెంగున్న అంతెత్తు లేచి,గ‌య్య్…. మంటూ అరిచి బొద్దింక‌ను దులిపేసుకుంది. ఇప్పుడు ఆ బొద్దింక ఆ మ‌హిళ ప‌క్క‌నే ఉన్న మరో వ్య‌క్తి మీద ప‌డింది…ఆ వ్య‌క్తి కూడా అలాగే అరిచి బొద్దింక‌ను వ‌దిలించుకున్నాడు. ఇంత‌లో…ఓ వెయిట‌ర్ వీళ్ళ‌కు స‌ర్వ్ చేయ‌డానికి వ‌చ్చాడు…ఈ సారి బొద్దింక అత‌ని మీద ప‌డింది….దీన్ని చూసిన ఆ వెయిట‌ర్ త‌న చేతిలోని ఆహార ప‌దార్థాలు టేబుల్ మీద పెట్టి…త‌న ష‌ర్ట్ మీద తిరుగుతున్న ఆ బొద్దింక‌ను ఒద్దిక‌గా చేత ప‌ట్టుకొని బ‌య‌ట వ‌దిలేసి వ‌చ్చాడు.

do you know what is cock roach theory and how it applies to our life

ఇప్పుడు దీన్ని జీవితానికి అన్వ‌యించుకుందాం…

బొద్దింక‌ను ఓ ఇబ్బందిగా, స‌మ‌స్య‌గా తీసుకుంటే…. మొద‌టి మ‌హిళ మ‌రియు వ్య‌క్తి…ఈ స‌మ‌స్య‌కు చాలా భ‌య‌ప‌డిపోయారు. దానిని ఎలాగైనా త‌ప్పించుకోవాల‌నుకొని స‌డెన్ నిర్ణ‌యం తీసుకున్నారు. అదే వెయిట‌ర్…. త‌న‌కు బొద్దింక అనే స‌మ‌స్య ఎదుర‌వ్వ‌గానే…. ఖంగారుప‌డ‌కుండా…చాలా ప్ర‌శాంతంగా దానిని గ‌మ‌నించి తీసి బ‌య‌ట‌ప‌డేసి వ‌చ్చాడు ( స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ్డాడు).

మ‌న‌ల్ని ఇబ్బంది పెట్టించే అంశాల ప‌ట్ల రియాక్ట్ అవ్వొద్దు , రెస్పాండ్ అవ్వాలి. రియాక్ట్ అనేది అచేత‌నంగా చేసేది, రెస్పాండ్ అనేది ఆలోచించి చేసేది. కాబ‌ట్టి ఓ స‌మ‌స్య‌ను ఎదుర్కొనే ముందు ఆలోచ‌న ముఖ్యం.

కాక్రోచ్ థియ‌రీ సారాంశం: A beautiful way to understand…………LIFE. Person who is HAPPY is not because Everything is RIGHT in his Life.. He is HAPPY because his Attitude towards Everything in his Life is Right..!!

Admin

Recent Posts