lifestyle

మీ గ్యాస్ స్టవ్ మురికి పట్టిందా.. ఇలా చేస్తే మెరిసిపోద్ది..!!

సాధారణంగా వంటగది అంటే ఎక్కువ మంది మహిళలే ఉంటారు. ఇక వంటగది క్లీనింగ్ అంటే వారికి పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. అలాంటి వంట గదిలో గ్యాస్ స్టవ్ తరచూ వివిధ పదార్థాలు పడి మురికి పడుతుంది. దాన్ని శుభ్రం చేయడం చాలా ఇబ్బందితో కూడుకున్న పని. అలాంటి గ్యాస్ స్టవ్ మీద మరకలు పడితే ఈ విధమైన చిట్కాలతో క్లీన్ చేసుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వంటింట్లో బేకింగ్ సోడా ఉంటే చాలు.ఎన్నో పనులు చేసుకోవచ్చు. ఈ సోడాతో గ్యాస్ స్టవ్ ను మిల మిల మెరిపించవచ్చు. ఈ సోడాని కొద్దిగా తీసుకొని నిమ్మరసం లేదా వైట్ వెనిగర్ లో కలిపి పేస్టులా చేయండి. దీన్ని గ్యాస్ స్టవ్ ఫై అప్లై చేసి కాసేపు ఉంచితే మరకలన్నీ మాయమవుతాయి. వంటింటి గ్లాస్ స్టవ్ క్లీన్ చేయడానికి నిమ్మరసం చాలా ఉపయోగపడుతుంది. దీని తొక్క బాగా పనిచేస్తుంది. వీటిని ఉపయోగించి గ్యాస్ స్టవ్ పై మరకలను ఈజీగా తొలగించవచ్చు.

follow these wonderful tips to clean your gas stove

వంటింట్లో ఉల్లిపాయలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. వీటిని రుచికి ఉపయోగిస్తారు. అలాంటి ఉల్లిపాయలను క్లీనింగ్ లో కూడా వాడచ్చని మీకు తెలియదు. అయితే ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని 20 నిమిషాల పాటు నీటిలో ఉడికించండి. ఈ నీటిని కాసేపు చల్లార్చాలి. అదే నీటిని స్ప్రే చేసి ఐదారు నిమిషాల పాటు ఉంచి చక్కగా క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ స్టవ్ పై ఉన్న మరకలు అన్ని తొలగిపోతాయి.

Admin

Recent Posts