lifestyle

మీ పిల్లలు టీవీ సెల్ ఫోన్ కు అలవాటు పడ్డారా అయితే ఇలా చేయండి..!!

ప్రస్తుత జనరేషన్లో ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ,సెల్ ఫోన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఉండడం తప్పేమీ కాదు కానీ ఈ వస్తువులకు బాగా అలవాటు పడిపోతే పిల్లల జీవితం సర్వనాశనం అవుతుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సెల్ ఫోన్. ప్రస్తుత కాలంలో ఐదేళ్ల పిల్లాడి నుంచి ముసలి తల్లి వరకు సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక కొన్ని కుటుంబాల్లో మాత్రం చిన్న పిల్లలు సెల్ ఫోన్ ఇస్తేనే ఫుడ్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే సెల్ ఫోన్, టీవీ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు వీరు ఎంతగా అడాప్ట్ అయ్యారో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. మరి వీటికి ఎక్కువగా అలవాటు పడిన పిల్లలు ఆ అలవాటు తగ్గించుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ముందు టీవీ, సెల్ ఫోన్ తో గడిపే సమయాన్ని తగ్గించుకోండి. అంతేకాకుండా ఎటువంటి పరిస్థితులు వచ్చిన పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇవ్వద్దు. ఒకవేళ వాళ్ళు అడిగితే అది పెద్దవారి కోసం మాత్రమే అని చెప్పండి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలతో గడపండి. వారికి రకరకాల ఆటలు నేర్పండి. అంతేకాకుండా ఆసక్తికరమైన పుస్తకాలు చదివించండి. పిల్లలు కూడా దాన్ని అనుకరిస్తారు.

how to stop kids using cell phone and tv

పిల్లలకు కథలు చెప్పండి దాని గురించి వారితో చర్చించండి. దీనివల్ల క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది. ఈ అలవాటు వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీ పిల్లలు మీరు చెప్పింది వింటూ ఉంటారు. మీ అభిప్రాయాలను కూడా గౌరవిస్తారు. ఈ విధంగా పిల్లలను సెల్ ఫోన్ లకు, టీవీలకు దూరం చేయండి.

Admin

Recent Posts