lifestyle

మీ భార్య ఈ విధంగా ప్రవర్తిస్తోందా..అయితే కష్టాల్లో పడ్డట్టే..!

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహమనేది ఒక మరపురాని ఘట్టం.. మనిషి జీవితంలో పుట్టడం చావడం మధ్య ఉండే వివాహం.. ఈ మూడు మానవ జీవితంలో చాలా ముఖ్యమైనవి.. అయితే ప్రస్తుత కాలంలో వివాహం అనే పదం మసకబారుతోంది.. పూర్వకాలంలో పెళ్లి చేసుకుంటే నిండు నూరేళ్లు పిల్లాపాపలతో చల్లగా ఉండాలని దీవించే వారు.. వారు ఏ విధంగా అయితే దివించేవారో భార్యాభర్తలిద్దరూ వంద సంవత్సరాలు కలిసి సంసార జీవితాన్ని హాయిగా గడిపేవారు. భార్య భర్తను భర్త భార్యను గౌరవిస్తూ ఉండేవాడు. ఈ విధంగా అండర్స్టాండింగ్ ఉండబట్టే వారి జీవితాలు చక్కగా ఉండేవి.

కానీ ప్రస్తుత వివాహ బంధాలు దాదాపుగా భార్యభర్తల మధ్య అండర్స్టాండింగ్ మిస్ అవ్వడం, చిన్న చిన్న పొరపాట్ల వల్లే పూర్తిగా వివాహ జీవితానికి స్వస్తి పలకడం లాంటివి చేస్తున్నారు.. సంసార జీవితంలో చిన్న చిన్న గొడవలు అనేవి సర్వసాధారణం. వాటిని సర్దుకుపోవాలి తప్ప వాటిని చిలికి చిలికి గాలి వానలా తయారు చేసుకొని చివరికి విడాకుల దాకా వెళ్లి జీవితాలను నాశనం చేసుకునే వారు చాలా మందే ఉన్నారు.. భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచి, గొడవలు తెప్పించి జీవితాన్ని మధ్యలో నాశనం చేసే కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.

if wives behave like this husbands might run into problems

వివాహమైన తర్వాత ప్రతి భార్య తన భర్తను ఒక దేవుడిలా భావిస్తుంది.. ఇలా భర్తపై ప్రేమ ని చూపించడం లో తప్పులేదు. కానీ భర్త గురించి ఎక్కువగా సెర్చ్ చేసి ఆయన బయట ఏం చేస్తున్నారు అని తరచూ ఆరా తీయడం వల్ల మీ బంధం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా లిమిట్ ఉన్నంతవరకే వ్యవహరించాలి తప్ప లిమిట్ దాటితే సంసార జీవితం చక్కగా ఉండదు. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకోవాలి.. నమ్మకం కోల్పోయిన జీవితంలో అలకలు ఏర్పడతాయి.. భార్యపై భర్తకు అనుమానం వచ్చిన భర్తపై భార్య కు అనుమానం వచ్చినా ఇక జీవితం ఆగినట్టే. కొంతమంది భార్యలు భర్త ఆఫీసులో వారి సహోద్యోగులు, ఆడవారితో ఏవిధంగా ఉంటున్నారు. అలాగే ఆయన ఫోన్ ను తరచూ తనిఖీ చేయడం, ఆయన ఏం చేయకున్నా నమ్మకం లేకుండా ఎవరి తోనో ఎఫైర్ ఉందని భావించడం చేస్తూ ఉంటారు.. దీనివల్ల కూడా మీ వివాహ జీవితం సమస్యల్లో పడుతుంది.

కొంతమంది భార్యలు వారి యొక్క భర్తని ఇతర కుటుంబ సభ్యులతో పోల్చడం, ఆయన ఎలా చేస్తున్నారో చూడండి మీరు ఉన్నారు అంటూ అనడం వల్ల కూడా మీ సంసార జీవితంలో కలహాలు ఏర్పడతాయి.. దీనివల్ల కూడా భార్య భర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయే అవకాశం ఉంది.

Admin

Recent Posts