lifestyle

మీరు మీ బాడీ పార్ట్స్‌తో ఇలా చేయ‌గ‌ల‌రా..? అయితే మీది ఓ ప్ర‌త్యేక‌మైన శ‌రీరం అన్న‌మాటే..!

భూమిపై ఉన్న మ‌నుషులంద‌రి శ‌రీరాలు ఒకే రకంగా ఉండ‌వ‌న్న సంగ‌తి తెలిసిందే. ఏ ఇద్ద‌రి చేతి వేళ్ల ముద్ర‌లు మ్యాచ్ కానట్టే ఏ ఇద్ద‌రి శ‌రీరాలు కూడా మ్యాచ్ కావు. చాలా విభిన్నంగా ఉంటాయి. అయితే శ‌రీర భాగాల సంగ‌తేమో కానీ వాటితో కొంద‌రు చేసే ప‌నులు మాత్రం దాదాపుగా ఒకే ర‌కంగా ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. కొంద‌రు చెవుల‌ను క‌దిలిస్తే, కొంద‌రు శరీర భాగాల‌ను వంచుతారు. ఇంకొంద‌రు మ‌రో ర‌కంగా శ‌రీర భాగాల‌ను ఆడిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా శ‌రీర భాగాల‌ను క‌దిలించే వారు ప్ర‌పంచంలో చాలా త‌క్కువ మందే ఉంటార‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే అలాంటి కొన్ని ప్ర‌త్యేక‌తల గురించి కింద తెలియ‌జేస్తున్నాం. ఇవి గ‌న‌క మీలో ఉంటే మీది చాలా స్పెష‌ల్ శ‌రీరం అన్న‌ట్టే లెక్క‌. మ‌రి ఆ ప్ర‌త్యేక‌తలు ఏంటో చూద్దామా..? ప‌్ర‌పంచంలో నాలుక‌ను నిలువుగా మ‌డ‌త‌పెట్టే వారు 64 శాతం ఉంటార‌ట‌. ఇక నాలుక‌ను అడ్డంగా మ‌డ‌త‌పెట్టేవారు 14 శాతం మంది ఉంటార‌ట‌. అదే నాలుక‌ను 3 మ‌డ‌త‌లు పెట్టేవారు కేవ‌లం 1 శాతం మందే ఉంటార‌ట‌. మీరు క‌న‌క ఈ జాబితాలో ఉంటే మీది స్పెష‌ల్ నాలుక అనే చెప్ప‌వ‌చ్చు.

త‌ల, ముఖంలో ఏ ఇత‌ర భాగాల‌ను క‌దిలించ‌కుండా కేవ‌లం చెవుల‌ను మాత్ర‌మే కదిలించే వారు ప్ర‌పంచంలో 18 శాతం మంది ఉంటార‌ట‌. ఇక కేవ‌లం ఒక చెవిని మాత్ర‌మే క‌దిలించే వారు 22 శాతం మంది ఉంటార‌ట‌. వీరిలో మీరు ఉన్నారో లేదో చూసుకోండి. ఉంటే మీ చెవులు చాలా స్పెష‌ల్ అన్న‌మాటే. కాలి వేళ్ల‌లో ఏ వేలునైనా సింగిల్‌గా క‌దిలించ‌గ‌ల‌రా..? చేయ‌లేరా..! ఎందుకంటే అలా చేసే వారు చాలా చాలా త‌క్కువ‌గా ఉంటార‌ట‌. అలాంటి వారిలో మీరు ఉంటే మీరు చాలా స్పెష‌ల్ అన్న‌ట్టే లెక్క‌. మీరు మీ మోచేయిని నాలుక‌తో ట‌చ్ చేయ‌గ‌లరా..? ఎందుకంటే ప్ర‌పంచంలో ఈ ఫీట్ చేసేవారు కేవ‌లం 1 శాతం మందే ఉన్నార‌ట‌. కాబ‌ట్టి మీరు ఇలా చేస్తే మీరు ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తుల‌ని భావిస్తాం. నోట్లో ముందు వ‌రుస‌లో పై భాగంలో ఉండే రెండు దంతాల మ‌ధ్య మీకు సందు ఉందా..? అయితే అందుకు దిగులు చెంద‌కండి. అందంగా లేమ‌ని విచారించ‌కండి. ఎందుకంటే ఇది స‌హ‌జంగానే జ‌రిగే ప్ర‌క్రియ‌. ఇలా ప్ర‌పంచంలో కేవ‌లం 20 శాతం మందికే ఉంటుంద‌ట‌. కొంద‌రు సెల‌బ్రిటీల‌కు కూడా ఇలా ప‌ళ్ల సందులు ఉన్నాయ‌ట‌. కాబ‌ట్టి మీరు స్పెష‌ల్ వ్య‌క్తుల కిందే లెక్కింప‌బ‌డ‌తారు.

if you have these abilities then you are in lucky group

క‌నుబొమ్మ‌లు రెండింటిలో కేవ‌లం ఒక్క దాన్నే పైకి కింద‌కు అన‌గ‌ల‌రా..? అయితే మీరు స్పెష‌ల్ అన్న‌ట్టే. ఎందుకంటే ఇలా చేసే వారు చాలా త‌క్కువ మంది ఉంటార‌ట‌. ఇక గ‌మ్మ‌త్త‌యిన విష‌యం ఏమిటంటే.. చెవుల‌ను క‌దిలించే వారు ఇలా చేయ‌గ‌ల‌ర‌ట‌. సొట్ట‌బుగ్గ‌లు ఉన్న ఆడ‌, మ‌గ ఎవ‌రైనా కొంత అందంగానే క‌నిపిస్తారు. ఇక వారు న‌వ్విన‌ప్పుడు చూస్తే రెండు క‌ళ్లు చాల‌వు. అయితే ప్ర‌పంచంలో ఇలా సొట్ట‌బుగ్గ‌లు ఉండే వారు 25 శాతం ఉంటార‌ట‌. క‌నుక మీరు ఈ జాబితాలో ఉంటే మీరు స్పెష‌ల్ అన్న‌మాట‌. మీ చెవుల్లో ఏ చెవి ప‌క్క‌నైనా చిన్న‌పాటి రంధ్రం ఉందా..? ఉంటే మీరు ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తులే. ఎందుకంటే ఇలాంటి వారు భూమ్మీద 5 శాతం మంది ఉన్నార‌ట‌. చేతి బొట‌న‌వేలిని మ‌ధ్య‌లోకి వంచ‌గ‌ల‌రా..? ఇలా చేసే వారు భూమ్మీద 25 శాతం మంది ఉన్నార‌ట‌. క‌నుక మీరు ఇలా చేస్తే స్పెష‌ల్ వ్య‌క్తుల జాబితాలో మీరు ఉన్న‌ట్టే.

చేతి బొట‌న‌వేలు, మ‌ధ్య వేలిని ప‌ట్టుకుని ఉంచితే మీ మ‌ణికట్టుపై కండ‌రం క‌నిపిస్తుందా..? అయితే మీరు స్పెష‌ల్ అన్న‌మాటే. ఎందుకంటే ఇలాంటి వారు ప్ర‌పంచంలో 14 శాతం మంది ఉన్నారు. చెవిపై చిన్న బుడిపె రూపంలో మీకు గ‌న‌క ఉందా..? దాన్ని డార్విన్స్ ట్యుబ‌ర్‌కిల్ అని పిలుస్తారు. ఇలా ఉన్న‌వారు ప్ర‌పంచంలో 10 శాతం మంది ఉన్నారు. ఇలా మీకు ఉంటే మీరు ప్ర‌త్యేక‌మైన ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తుల జాబితాలో ఉన్న‌ట్టే.

Admin

Recent Posts