పెళ్లంటే నూరేళ్లపంట అంటుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహబంధం చాలా పవిత్రమైనది. ఆ బంధాన్ని దృఢంగా ఉంచుకోవడానికి, కలకాలం ఆనందంగా గడపడం అనేది భార్యాభర్తల చేతుల్లో ఉంటుంది. ఈ రోజుల్లో భార్యాభర్తల గొడవలతో చిన్నభిన్నమవుతున్నాయి. ఇద్దరు దంపతులిద్దరు కూడా కలిసిమెలిసి ఉంటే ఆ కుటుంబం పచ్చని కాపురంలా ఉంటుంది. వారి జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోవాలంటే ఒకరికి ఒకరు అర్థం చేసుకోవాలి. మరి మీ భర్త మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇలాంటి విషయాలను గమనిస్తే సరిపోతుంది అవేంటో చూద్దాం.
ఏదైనా విషయాలు మీతో చెప్పినప్పుడు ఓపికగా వింటున్నారా లేదా అనేది గమనించాలి. అలా మీరు చెప్పే విషయాలు ఓపికగా వింటున్నారంటే మీపై ప్రేమ ఉన్నట్టు గుర్తించాలి. మీరు ఎంత పెద్ద తప్పు చేసినా మీపై మీ భర్త ఎలాంటి కోపానికి రాకుండా ఉన్నాడంటే మీపై ప్రేమ ఉన్నట్లు లెక్క. భార్య కొన్ని కొన్ని అలవాట్లు మార్చుకుంటుంది. అలాంటి సమయంలో మీ భర్త మీ అలవాట్లకు అనుగుణంగా నడుచుకుంటున్నాడంటే మీపై ప్రేమ కురిపిస్తున్నట్టుగా భావించాలి. మీరు ఇలా కూడా మీ భర్త మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తున్నారని తెలుసుకోవచ్చు. మీపై ప్రేమని ప్రతి నిమిషం నీ భర్త ఏదో విధంగా ప్రేమ కురిపించినట్లయితే మీరంటే ఆయనకి ఎంతో ఇష్టమని తెలుసుకోవచ్చు.
మీ భర్త మీద ఏదో ఒక రూపంలో ప్రేమను బయటపెట్టి మిమ్మల్ని సంతోషంగా ఉంచినట్లయితే మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. మీరు అడగకముందే అన్నీ చేసినా మీపై ప్రేమ ఉన్నట్లు గమనించాలి.