lifestyle

త‌న కోప‌మే త‌న శ‌త్రువు.. వ్యాపారికి క‌నువిప్పు క‌లిగింది..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఓగ్రామంలో రాములవారి గుడి ఉంది&period; ఒకరోజు అక్కడికి వచ్చిన ఉపన్యాసకుడు అరిషడ్వర్గాల గురించి ప్రసంగించాడు&period; కామ&comma; క్రోధ&comma; లోభ&comma; మోహ&comma; మద&comma; మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అంటారు&period; ఇవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి&period; మనిషి పతనానికి&comma; ప్రకృతి వినాశనానికి కారణమవుతాయి&period; వీటిని ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్థం&comma; సంకుచిత భావాలతో నిండి ఉంటుంది అని వివరించాడు&period; ఉపన్యాసం పూర్తయ్యాక ఆయన అక్కడినుంచి బయల్దేరబోయాడు&period; గుడి ముందు అంగడి పెట్టుకుని ఉన్న వ్యాపారి ఆయన దగ్గరికి వచ్చాడు&period; మీరు మీ ఉపన్యాసంలో అనేకసార్లు తన కోపమే తన శత్రువు అని చెప్పారు&period; అది ఎలా&quest; అని అడిగాడు&period; నువ్వు ఏం చేస్తూ ఉంటావు&quest; అని ప్రశ్నించాడు ఉపన్యాసకుడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ గుడి ముందు కొబ్బరికాయలు&comma; కర్పూరం&comma; అరటిపండ్లు&comma; సాంబ్రాణి&comma; ఒత్తులు&comma; అగ్గిపెట్టె లాంటివి అమ్ముతూ ఉంటానని బదులిచ్చాడు వ్యాపారి&period; వెంటనే ఉపన్యాసకుడు అగ్గిపెట్టెలోని అగ్గి పుల్లలతో మనం ఏం చేస్తాం&quest; అని ప్రశ్నించాడు&period;&&num;8217&semi;వేరే వాటిని కాల్చడానికి అగ్గిపుల్లలను ఉపయోగిస్తాం అని సమాధానం ఇచ్చాడు వ్యాపారి&period; ఉపన్యాసకుడు చిన్నగా నవ్వి అగ్గిపుల్లని గీసినప్పుడు ఏమి జరుగుతుందో గమనించావా&quest; అని మళ్లీ ప్రశ్నించాడు&period; అందరికీ తెలిసిందే కదా&comma; మొదట అగ్గిపుల్ల కాలడం జరుగుతుంది అని తేలికగా చెప్పాడు వ్యాపారి&period; తను కాలకుండా అగ్గిపుల్ల వేరే వాటిని కాల్చగలదా&quest; అని సూటిగా అడిగాడు ఉపన్యాసకుడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75830 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;fire&period;jpg" alt&equals;"ones anger is their enemy " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్షణం ఆలోచించి కుదరదు కాక కుదరదన్నాడు వ్యాపారి&period; అలాగే కోపమొచ్చిన మనిషి కూడా&excl; మనం కోపంతో ఉన్నప్పుడే&period;&period; ఎదుటివారిపై కోపాన్ని వ్యక్తం చేయగలం&period; అంటే ఎదుటి వ్యక్తికి నష్టం జరగడాని కన్నా ముందే మనకు నష్టం జరుగుతుందన్నమాట&period; ఇక్కడ మనం తెలుసుకోవల్సింది ఏమిటంటే&comma; మాట అన్నవాడు&comma; మాట అనిపించుకున్న వాడు… ఇద్దరూ ఇబ్బంది పడతారు&period; అందుకే తన కోపమే తన శత్రువు అని చెప్పాను అని వివరించాడు ఉపన్యాసకుడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts