lifestyle

మొల‌తాడును క‌డితే పురుషాంగం సైజు పెరుగుతుందా..?

మనదేశంలో చాలామంది మగవాళ్ళు మొలతాడును ధరిస్తుంటారు. భారతదేశంలో పాటించే చాలా ఆచారాల వెనుక శాస్త్రీయ కోణం దాగి ఉందని పండితులు చెబుతుంటారు. మొలతాడు ప్యాంట్ జారిపోకుండా ధరిస్తారు అని తెలియని వారు భావిస్తుంటారు. కానీ దీని వెనుక కూడా ఒక శాస్త్రీయ కోణం ఉంది. ఇది ధరించడం వలన మగవారికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మొలతాడు గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

మొలతాడు అనేది నడుము కింది భాగంలో కట్టుకునే ఒక తాడు. ముఖ్యంగా హిందూ ధర్మాన్ని ఆచరించే మగవారు నలుపు లేదా ఎరుపు రంగు మొలతాడు కట్టుకుంటారు. ఈ సంప్రధాయం ప్రధానంగా దక్షిణ భారత దేశంలో కనిపిస్తుంది. ఉత్తర భారతదేశం మగవారు కూడా చాలా వరకు ఈ ఆచారాన్ని పాటిస్తారు. సాధారణంగా చెడు దృష్టి పడకుండా.. దుష్ట శక్తుల నుంచి రక్షణగా మొలతాడు ఉంటుందని చెబుతారు. వేదాల ప్రకారం స్నానం చేసేటప్పుడు నగ్నంగా ఉండకూడదు. కనీసం చిన్న గుడ్డైనా ఉండాలి. మొలతాడు పవిత్రమైనది కాబట్టి అది ఒంటి మీద ఉంటే ఎలాంటి దోషాలు ఉండవనేది వేదం చెబుతుంది.

will tying molathadu increases penis size

ఆరోగ్యపరంగా కూడా మొలతాడు ప్రాముఖ్యత కలిగింది. కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మొలతాడుని ధరించాలి అంటారు. మొలతాడు కడుపులోకి వెళ్లే ఆహారాన్ని నియంత్రణలో ఉంచుతుంది. తద్వార జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది బరువు పెరగడాన్ని కూడా తెలియబరుస్తుంది. బిగుతుగా ఉంటే కొవ్వు పెరిగినట్టు వదులుగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. నడుము ప్రాంతంలో నల్లటి దారం ఉంటే అది ఆ ప్రాంతంలో వేడిని గ్రహిస్తుంది. వృషణాలు అథిక వేడికి గురైతే మగవారిలో సుక్రకణాల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి వేడిని గ్రహించే నల్లటి మొలతాడు పరోక్షంగా మగవారిలో సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతారు.

ముఖ్యంగా మగ పిల్లల్లో పెరుగుదల సమయంలో పురుషాంగం ఎటువంటి అసమతుల్యానికి గురికాకుండా కచ్చితమైన పెరుగుదల ఉండేందుకు మొలతాడును కడతారట.

Admin

Recent Posts