వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారు క‌చ్చితంగా బీపీని అదుపులో ఉంచుకోవాలి.. ఎందుకంటే..?

మధ్యవయసులో వున్న పెద్దలు టైప్ 2 డయాబెటీస్, రక్తపోటు రెండూ కలిగి వుంటే ముందుగా వారు రక్తపోటు మందులు వాడకుండా సహజ ఆహారాల ద్వారా ఎలా నియంత్రించుకోవాలనేది తెలుసుకోవాలి. అయితే, సహజ ఆహారాల ద్వారా తగ్గాలంటూ అధిక కాలం రక్తపోటుతో కూడా బాధపడరాదని ఒక తాజా స్టడీ సూచిస్తోంది.

డయాబెటీస్ రోగులు తమ రక్తపోటును నియంత్రించటంలో ఒక సంవత్సరంపాటు ఆలస్యం చేస్తే వారి జీవితకాలం రెండు రోజులపాటు తగ్గిపోతుందని చికాగో యూనివర్శిటీ రీసెర్చర్లు జనరల్ ఇంటర్నల్ మెడిసిన్ అనే జర్నల్ లో ప్రచురించారు. డయాబెటిక్ రోగులలో రక్తపోటు గుండెజబ్బులు తెస్తుందని, కరోనరీ ఆర్టరీ వ్యాధులు, కిడ్నీ విఫలత, చూపు మందగించటం, అవయవాలు తొలగింపు మొదలగు సమస్యలను కూడా తెస్తుందని అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ మరియు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్ధలు హెచ్చరిస్తున్నాయి.

diabetes patients must control their bp know why

డయాబెటిక్ రోగులు వారి రక్తపోటును 130/80 ఎంఎం హెచ్జి వుండేలా మెయిన్టెయిన్ చేయాలని సూచిస్తున్నాయి. వీరు రక్తపోటుకై మందులు, డయాబెటీస్ మందులతో కూడా కలిపి వాడే కంటే కూడా వ్యాయామం, ఆహార నియంత్రణలద్వారా వాటిని నియంత్రించాలని అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ తెలిపింది.

Admin

Recent Posts