వైద్య విజ్ఞానం

మాన‌వుడి గుండె ఎలా ప‌నిచేస్తుందో తెలుసా..? ఇది చ‌ద‌వండి..!

మానవుడి గుండె ఒక సంక్లిష్టమైన అవయవం. శరీరంలోని అన్ని భాగాలకంటే కూడా ప్రధానమైనది. నిరంతరం పని చేస్తూనే వుండేది. దీని బరువు షుమారుగా 250 గ్రాములు వుంటుంది. ఇది శరీరం లోని అన్ని భాగాలకు రక్తం పంపిణీ చేస్తుంది. ఈ ప్రధాన అవయవం లేకుంటే, శరీరంలోని ఇతర అవయవాలు, టిష్యూలు ఆక్సిజన్ అందక మరణిస్తాయి.

గుండె ఛాతీ వెనుకభాగ గోడకు దగ్గరలో వుంటుంది. దీనిలో నాలుగు ఛాంబర్లు వుంటాయి. వీటిని కుడి, ఎడమ అట్రియా అని, కుడి, ఎడమ వెంట్రికిల్స్ అని అంటారు. ఈ ఛాంబర్లు రక్తాన్ని శరీరమంతా పంపిణీ చేస్తుంటాయి. కుడి అట్రియం ఛాంబర్ ఆక్సిజన్ లేని బ్లడ్ ను రెండు ప్రధాన వీన్స్ నుండి తీసుకుంటుంది. తర్వాత దానిని ఒక వాల్వ్ ద్వారా కుడి వెంట్రికల్ కు పంపుతుంది. కుడి ఆట్రియంలో రక్తం మరల వెనక్కు రాకూడదనుకుంటే ఈ వాల్వ్ అత్యవసరంగా వుండాలి.

do you know how a human heart works

కుడి వెంట్రికల్ నుండి అపుడు రక్తం పల్మనరీ సెమిల్యూనార్ వాల్వ్ గుండా పల్మనరీ ట్రంక్ కు చేరుతుంది. పల్మనరీ ఆర్టరీలు రక్తంను ఊపిరితిత్తులలోని ఆక్సిజన్ కు కలుపుతాయి. ఇక ఇపుడు ఎడమ అట్రియం ఆక్సిజన్ వున్న బ్లడ్ ను ఎడమ వెంట్రికల్ లోకి పంపుతుంది. ఆక్సిజన్ తో కలిగిన ఈ రక్తం అయోర్టా ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు పంపబడుతుంది.

Admin

Recent Posts