వైద్య విజ్ఞానం

మీకు గోళ్ల‌ను కొరికే అల‌వాటు ఉందా.. అయితే డేంజ‌రే..!

చాలా మందికి గోర్లు కొరికే అలవాటు ఉంటుంది. పిల్లలకు మాత్రమే కాదు పెద్దలు కూడా గోర్లని కొరుకుతూ ఉంటారు. మీకు కూడా ఈ అలవాటు ఉందా..? పదేపదే గోర్లని కొరకడం వలన ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే మరి గోర్లని కొరకడం వలన ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. మన గోళ్ళలో వివిధ రకాల సూక్ష్మ క్రిములు ఉంటాయి. నోట్లో గోర్లని పెట్టుకోవడం వలన అవి మన ఒంట్లోకి చేరుతాయి. దీనితో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమస్యలు వస్తాయి. గోళ్ళలో సాల్మోనల్లా, ఈ కొలి వంటి బ్యాక్టీరియా ఉంటాయి. ఇది ఈజీగా నోట్లో నుండి శరీరంలోకి వెళ్లి పోతాయి.

గోర్లను కొరికే వారికి దంతాల సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఇలా చెయ్యద్దు. గోళ్ళని కొరకడం వలన బ్యాక్టీరియా పేగుల్లోకి వెళుతుంది ఇది క్యాన్సర్ వంటి ప్రాణాంతకరమైన సమస్యలను తీసుకొస్తుంది. కొన్ని కొన్ని సార్లు గోర్లను కొరకడం వలన డెర్మటా ఫాగియా అనే సమస్య కూడా వస్తుంది దీని మూలంగా చర్మం పై గాయాలు ఏర్పడడం నరాలు ఎఫెక్ట్ అవ్వడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి.

if you are biting nails then it is bad for your health

గోర్లని కొరకే అలవాటు ఉంటే దవడలో ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గోళ్ళని కొరక్కుండా ఉండాలంటే ఇలా చేయండి. చేదు పదార్థాలని గోళ్ళకి రాసుకోవడం. నెయిల్ కట్టర్ తో గోళ్లను కట్ చేసుకోవడం. మానసిక సమస్యలు ఏమి లేకుండా చూసుకోవడం వంటివి అనుసరిస్తే ఖచ్చితంగా గోళ్లను కొరకకుండా ఉండొచ్చు.

Admin

Recent Posts