వైద్య విజ్ఞానం

అంటాసిడ్ల‌ను అధికంగా వాడుతున్నారా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

గుండెలో మంట, పొట్ట బిగతీయటం, అజీర్ణం, డయేరియా, పొట్ట నొప్పి లాంటి వాటికి సాధారణంగా సొంతంగానే వైద్యం చేసుకుంటాం. చిన్నపాటి ఈ అనారోగ్యాలకు యాంటాసిడ్లు లేదా యాంటీబయోటిక్స్ లాంటివి వేసేస్తే ఏమీ ఫ‌రవాలేదని అందరూ అనుకుంటారు. మరికొంతమంది వీటికి మరింత గట్టిమందులే వేస్తూ డాక్టర్ ను సంప్రదించకపోయినా ఫ‌రవాలేదనుకుంటారు. ఎమర్జెన్సీ పరిస్ధితులలో ఎప్పుడైనా యాంటాసిడ్ లు వేయటంవరకు ఫ‌రవాలేదు.

కానీ వాటిని వైద్యులను సంప్రదించకుండా రెగ్యులర్ గా వాడటం సరికాదు. డయేరియా లేదా పేగు సంబంధిత విరోచనంలాంటివి బాక్టీరియా ఇన్ఫెక్షన్, ఆహారం పడకపోవటం, మెడిసిన్ పడకపోవటం వంటి వాటి వలన వస్తాయి. కనుక వీటికి డాక్టర్ అవసరం వుంటుంది. సాధారణంగా అందరూ డయేరియా అనేసరికి యాంటీబయోటిక్స్ వాడేస్తారు. కానీ ఇవి బాక్టీరియాతో కలిగే ఇన్ఫెక్షన్ వలన అయితేనే వాడాలి. ఒక్కొక్కపుడు యాంటీబయోటిక్స్ వికటించే ప్రమాదం కూడా వుంది.

if you are taking antacids regularly then know what happens

గుండెమంట, పొట్ట భారం, అజీర్ణం వంటి వాటికి యాంటాసిడ్ లు విపరీతంగా వాడేస్తారు. ఇవి కడుపులో ఏర్పడే యాసిడ్లను కొన్నింటిని న్యూట్రలైజ్ చేస్తాయి. మరి కొన్ని యాసిడ్ ఉత్పత్తినే తగ్గించేస్తాయి. ఈ మందులు తాత్కాలికంగా తగ్గిస్తాయి. కానీ కొన్ని సార్లు సమస్యను అధికం కూడా చేస్తాయి. యాంటాసిడ్లు పొట్టనొప్పిని తగ్గిస్తాయి. కానీ పూర్తిగా దానిని నివారించలేవు. కనుక డయేరియా వంటి వాటికి సరైన రోగ నిర్ధారణ అందుకు తగిన వైద్యం డాక్టర్లు చేయటమే మంచిదిగా భావించాలి.

Admin

Recent Posts