వైద్య విజ్ఞానం

ఎల‌క్ట్రిక్ రైస్ కుక్క‌ర్‌లో వండుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

ప్రజెంట్ ఉన్న బిజీ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ మంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనే అన్నం వండుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ కుక్కర్ లో వండిన ఆహారం తింటే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు. వంట చేయడానికి అల్యూమినియం పాత్రలు వాడకపోవడమే మంచిది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తినడం వల్ల అతి చిన్న వయసులోనే కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పాత్ర టాక్సిన్ మెటల్ తో తయారవుతుంది. ఇందులో అన్నం ఉడికించడం వల్ల అందులోని పోషకాలు కనుమరుగవుతాయి. నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అస్సలు వాడొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నాన్ స్టిక్ వస్తువులలో వంట చేసే సమయంలో అందులోంచి ప్రమాదకరమైన కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఇవి క్యాన్సర్ కి దారి తీస్తాయి. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లను వాడకపోవడం మంచిది.

if you are using electric rice cooker then beware

రాగి సంకటి, రాగి జావ, జొన్న రొట్టెలు, కొర్రలతో అల్పాహారం చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అన్నం త్వరగా వండాలనుకున్నప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్ కంటే ప్రెజర్ కుక్కర్లో వండితే ఆరోగ్యానికి మేలు. కరెంట్ ఆధారంగా ఉడికిన ఆహారం తీసుకోకపోవడమే మంచిది.

మట్టిపాత్రలు, లేదా స్టీల్ పాత్రల్లో అన్నం ఉడికించుకుని తీసుకోవడం మేలు. మట్టి పాత్రల్లో అన్నం ఉడికించడం వల్ల మట్టిలోని పోషకాలు ఆహారానికి మరింత రుచిని ఇస్తాయి.

Admin

Recent Posts