వైద్య విజ్ఞానం

గుండెల్లో మంట‌గా ఉందా..? అయితే త‌ప్పుగా అనుకుంటే న‌ష్ట‌మే..?

గుండెల్లో మంట అనేక కారణాల వలన కలుగవచ్చు ప్రాథమిక నిర్థారణ అదనపు చిహ్నాలు, లక్షణాలమీద ఆధారపడిఉంటుంది. గుండె మంట వలన వచ్చే చాతీ నొప్పి మండే అనుభూతిని కలిగిఉంటుంది, ఇది సాధారణంగా రాత్రి భోజనం తరువాత వస్తూ వుంటుంది. ఈ మంట పడుకున్నప్పుడు కానీ, వంగినప్పుడు కానీ ఎక్కువవుతుంది. ఇది గర్భవతి మహిళలలో కూడా సాధారణంగా వస్తూంటుంది. ఇది ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడంవలన, లేదా కొన్ని మసాలాలు, అధిక క్రొవ్వు శాతం లేదా అధిక ఆమ్ల శాతం కల ప్రత్యేక ఆహారపదార్థాలను తీసుకోవడంవలన కూడా వస్తుంది.

ఒకవేళ చాతీ నొప్పి గుండెల్లో మంటగా నిర్థారించబడితే అపుడు దానిని నిర్ధారించుకోవడం కోసం మరి కొన్ని పరీక్షలకు వెళ్ళవలసి ఉంటుంది. గుండెల్లో మంట లేదా చాతీ నొప్పి తిన్నా లేదా త్రాగిన తరువాత మింగడానికి ఇబ్బంది పడుతూవుంటే ఇది ఆహార గొట్టపు అసౌకర్యాన్ని సూచిస్తుంది. పైరోసిస్ లేదా ఆమ్ల అజీర్ణం గా పిలువబడే గుండెలో మంట అనేది గుండెలో, ఛాతి ఎముకకి సరిగ్గా వెనుక లేదా ఎపిగాస్ట్రియంలో మండే అనుభూతి వంటిది.

if you have heart burn then know the meaning of it

ఈ నొప్పి తరచుగా ఛాతిలో మొదలయి మెడ, గొంతు, లేదా దవడ వైపుకి ప్రాకుతుంది. గుండెల్లో మంట సాధారణంగా గ్యాస్ట్రిక్ ఆమ్ల చర్యలతో కలిసి ఉంటుంది, ఇది గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ప్రధాన లక్షణం. అలాగే ఇది ఇషేమిక్ గుండె జబ్బు యొక్క లక్షణం కూడా, అందుకే చివరకు చెప్పాలంటే గుండెల్లో మంట ఒక్కొక్కపుడు ప్రాథమికంగా తప్పుడు వ్యాధి నిర్థారణకి కూడా దారితీస్తుంది.

Admin

Recent Posts