వైద్య విజ్ఞానం

ఈ మూడు లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా ? జాగ్రత్త అది మీకు గుండెపోటుకి దారి తీయొచ్చు..!

ఈమధ్య గుండెపోటు కేసులు ఎక్కువయ్యాయి. అప్పటివరకు బాగానే ఉన్నవారు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి తిరిగిరాని లోకాలకు చేరిపోతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారు పెరిగిపోతున్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతిరోజు వ్యాయామం చేసే యువతలో కూడా ఆకస్మాత్తుగా గుండెపోటు రావడం ప్రస్తుతం మనం ప్రధానంగా చూస్తున్నాం. అయితే ఈ మూడు లక్షణాలు మీలో ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మన పని, షెడ్యూల్, జీవనశైలి అన్ని నేరుగా మన ఆందోళనకు దోహదం చేస్తాయి. ఈ ఆందోళన మన గుండె సమస్యలను పెంచుతుంది. ఆందోళన, గుండెజబ్బులు ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తో జీవించే వారిలో ఈ గుండె జబ్బు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

if you have heart problem these signs will show

కొందరికి ఏదైనా శారీరక శ్రమ చేస్తే చెమట పడుతుంది. కానీ ఏమీ చేయకుండా ఆనందంగా చెమటలు ప‌ట్టడం మామూలు విషయం కాదు. ఇది భవిష్యత్తులో గుండెపోటుకు సంకేతం. ఒక వ్యక్తి ఎలాంటి శారీరక శ్రమలో పాల్గొననప్పుడు కూడా విపరీతంగా చెమటలు పట్టడం గుండెపోటుకు సంబంధించిన మొదటి సంకేతాలలో ఒకటి.

పనిచేసిన తర్వాత రోజు చివరిలో అలసిపోవడం సహజమే. కానీ ప్రతిరోజు అదే అలసట అనిపిస్తే దీనికి వేరే కారణం ఉంది. ఇలా గుండెపోటు వచ్చే లక్షణాల్లో అలసట కూడా ఒకటని వైద్యులు చెబుతున్నారు. ఎవరైనా దీర్ఘకాలంగా అలసటతో బాధపడుతుంటే వెంటనే డాక్టర్ ని కలవండి అంటున్నారు నిపుణులు.

Admin

Recent Posts