వైద్య విజ్ఞానం

ఉద‌యం నిద్ర లేవ‌గానే అంతా మ‌రిచిపోయిన‌ట్లు అనిపిస్తుందా.. అందుకు కార‌ణాలు ఇవే..!

ఉదయం నిద్ర లేవగానే ఏ విషయం స్మరణకు రావటం లేదా? తాత్కాలికంగా అన్నీ మర్చిపోతున్నారా? కళ్ళు తిరిగినట్లుండటం, కళ్ళముందు చీకట్లు కమ్మటం జరుగుతోందా? అంటే దాని అర్ధం అన్నీ మరచిపోయేటంత గాఢ నిద్రకు గురవుతున్నారన్నమాట. నిద్ర లేవగానే ఎక్కడో కొత్త చోటుకు వచ్చానన్న భావన మీకు కలుగుతుంది. ఏం జరిగిందో, ఏం జరుగుతుందో మీకు తెలియటం లేదు. ఈ పరిస్ధితిలో మీరు ఆందోళన పడాల్సిన పని లేదు. దీనికి సైంటిఫిక్ గా చక్కని వివరణ వుంది.

తాత్కాలికంగా మీరు అంతా మరచిపోతున్నారంటానికి కొన్ని కారణాలు పరిశీలించండి. అధికంగా ఆల్కహాలు తీసుకుంటే మీలోని ఎనర్జీ అంతా ఖాళీ అయిపోయి గాఢ నిద్ర పట్టేస్తుంది. మరోమారు శరీరం పూర్తి శక్తి పొందితే గాని మీరు సరిగా నిద్ర లేవలేరు. అకస్మాత్తుగా మీ బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతే కూడా అంతా మరచిపోయే స్ధితి కలుగుతుంది. మీ శరీరంలోని రక్తంలో గ్లూకోజు స్ధాయి ఏ కారణంగా తగ్గినా మీకు ఈ రకమైన జ్ఞాపక శక్తి కోల్పోవటం జరుగుతుంది. అంతేకాదు మీ కళ్ళముందు చీకటి వలయాలు కమ్మటం, శరీరం చల్లగా వుండటం కూడా ఏర్పడుతుంది. దీనికి కారణం మీ మెదడుకణాలకు అవసరమైన గ్లూకోజ్ సరఫరా పొందకపోవటమే.

if you have question mark face in the morning know the reasons

ఇది నమ్మశక్యం కాకపోయినా, అధిక ఒత్తిడి కలిగితే కొన్ని హార్మోన్లు అసమతుల్యమై కళ్ళముందు అంతా చీకటి కమ్మినట్లయిపోతుంది. ఈ పరిస్ధితి పురుషులకంటే కూడా మహిళలలో అధికంగా వస్తుంది. మీరు ధరించే దుస్తులు అతి బిగువుగా వుంటే కూడా రక్త సరఫరా సరిగా జరుగక దాని ప్రభావం బ్రెయిన్ పై పడి కళ్ళకు చీకట్లు కమ్మే ప్రమాదం వుంది.

Admin

Recent Posts