వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ వ్యాధిలో రోగిదే ముఖ్య పాత్ర‌..!

మీకు వచ్చిన డయాబెటీస్ వ్యాధిని మీరే నియంత్రించుకోవాలి! అది ఎలా? ప్రతిరోజూ…ప్రతి భోజనంలోనూ, లేదా ప్రతి ఆహారంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. బ్లడ్ షుగర్ స్వయంగా చెక్ చేసుకోవడం, డాక్టర్ అపాయింట్ మెంట్లు, ల్యాబ్ పరీక్షలు వంటి వాటి ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకుంటున్నారు. మీకు తోడుగా ఒక వైద్యుడు, పోషకాహార నిపుణుడు, డయాబెటీస్ నిపుణుడు, వ్యాయామ శిక్షకుడు, ఫార్మసిస్టు ఇంకా ఎందరో ఈ అంశంలో మీకు సహకరిస్తారు.

డయాబెటీస్ స్వయం నియంత్రణ అనేది 24/7 గంటల కార్యక్రమం. అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనేది మీకే తెలుసు. డయాబెటీస్ వైద్యంలో రోగిదే ప్రధాన పాత్ర. ఎప్పటికపుడు ఈ రంగంలో వచ్చే వైద్య విధానాల మార్పులను కూడా రోగి తెలుసుకోవాలి. వైద్యుల పర్యవేక్షణలో ఆచరించేందుకు ప్రయత్నించాలి.

patient role is very much important in diabetes

అవసరమనుకుంటే, ఇన్సులిన్ ఇంజక్షన్లను స్వయంగా చేసుకోవడం ఇన్సులిన్ పంప్ వాడకం వంటివి కూడా చేయాలి. ఇరవై నాల్గు గంటలూ తీసుకునే జాగ్రత్తలతో డయాబెటీస్ వ్యాధి మీ దరిదాపులకు రాకుండా చూసుకోవచ్చు. లేదా వ్యాధికలవారైతే, నియంత్రించుకోవచ్చు.

Admin

Recent Posts