వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మీకు హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ని అర్థం..!

ఎక్కువమంది ఈ రోజుల్లో గుండె పోటుతో బాధ పడుతున్నారు గుండెపోటుతో చాలా మంది చనిపోతున్నారు కూడా. గుండెపోటు రావడానికి ముందు మనకి కనబడే ప్రధాన లక్షణం ఛాతి లో నొప్పి. గుండెకి రక్తప్రసరణ కి ఆటంకం ఏర్పడినప్పుడు చాతి నొప్పి వస్తుంది గుండెపోటు ఏకైక లక్షణం చాతి నొప్పి. ఇదే కాకుండా కొన్ని లక్షణాలు కూడా కనబడతాయి. గుండెపోటు వచ్చే ముందు చర్మం మారిపోతుంది చర్మం లేత బూడిద రంగులోకి మారిపోతుంది పైగా గుండెపోటు రావడానికి ముందు విపరీతంగా చెమటలు పడతాయి.

వికారం శ్వాస ఆడకపోవడం వంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంత మందిలో మూర్ఛ, ఆందోళన కూడా కనబడుతుంటాయి. పురుషుల్లో అయితే ఛాతి నొప్పి మొదట కనబడుతుంది మహిళల‌ లో అయితే మెడ దవడ లో అలసట నొప్పి వంటివి కనపడుతూ ఉంటాయి. సైలెంట్ హార్ట్ ఎటాక్ కూడా కొందరిలో వస్తుంది. డయాబెటిస్ వంటి సమస్యల వలన సైలెంట్ గా హార్ట్ ఎటాక్ వస్తుంది.

these signs indicate that you are getting heart attack

అనుమానపడేలా ఎటువంటి లక్షణాలు కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్ లో కనపడవు కొంత మందికి అయితే చెమటలు పట్టడం మెడ దవడ ఎడమ భుజం లో నొప్పి వంటివి ఉంటాయి. మంచి జీవన శైలిని అనుసరించడం, మంచి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన గుండె పోటు రాకుండా జాగ్రత్త పడొచ్చు. ప్రతీ రోజు వ్యాయామం చేయడం వలన కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు.

Admin

Recent Posts