వైద్య విజ్ఞానం

మ‌హిళ‌ల్లో ఛాతి నొప్పి వ‌స్తుంది అంటే గుండె పోటు వ‌చ్చిన‌ట్లేనా..?

ఛాతీ నొప్పి అంటే గుండె పోటుకు సూచన అంటారు. అయితే కొంతమంది విషయంలో ఇది సరికాదు. అలాగని అశ్రద్ధ కూడా చేయరాదు. మహిళలలో ఛాతీ నొప్పి వస్తోందంటే, అది ఛాతీ వరకే కాదు, ఇతర అనారోగ్యాల కారణంగా కూడా వస్తోందని చెప్పాలి. ఛాతీ నొప్పి గల మహిళలకు ముందుగా కరోనరీ ఆర్టరీ (హృదయ ధమని వ్యాధి) వ్యాధి కొరకు స్క్రీనింగ్ చేస్తారు. తరచుగా ఇది గుండె పోటు వంటిది కాదని తెలుపుతుంది. కనుక మహిళలలో ఛాతీ నొప్పి అంటే రోగనిర్ధారణ కష్టతరమే.

గుండెకు సంబంధంలేని కారణాలుగా కూడా మహిళలలో ఛాతీ నొప్పి వస్తుందని పరిశోధకులు అనేక పరిశోధనలలో తెలిపారు. సాధారణంగా మహిళ మెనోపాజ్ దశకు వచ్చిన తర్వాత ఈస్ట్రోజన్ స్ధాయి తగ్గి గుండె పోటు వచ్చే అవకాశం వుంది కాని మెనోపాజ్ దశ ముందు ఇట్టి అవకాశం లేదు. గుండెకు లేదా ఊపిరితిత్తులకు రక్తం తీసుకు వెళ్ళే రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడటం వలన గుండె జబ్బు వచ్చే అవకాశం వుంది.

what are the reasons for chest pain in women

మహిళలలో వచ్చే ఛాతీ నొప్పి ఒత్తిడి, ఆందోళనల కారణంగా కూడా ఏర్పడే అవకాశం వుందని వైద్య పరిశోధనలు చెపుతున్నాయి. సాధారణంగా ఈ నొప్పి వీరికి మెనోపాజ్ ముందు దశలో వచ్చే అవకాశాలుంటాయి. కనుక మహిళలలో వచ్చే ఛాతీ నొప్పికి ప్రత్యేకమైన రోగ నిర్ధారణ పరీక్షలు జరిపి వాస్తవాలను వైద్యులు అతికష్టంపై నిర్ధారిస్తారు.

Admin

Recent Posts