వైద్య విజ్ఞానం

ఇయ‌ర్ ఫోన్స్ లేదా ఇయ‌ర్ బ‌డ్స్‌ను అతిగా వాడుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

ఇయర్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు మన బాడీలో ఒక పార్ట్‌లా మారిపోయాయి. ఇంట్లో ఉన్నా, బయటకెళ్లినా, బస్‌లో ట్రావెల్‌ చేసినా.. ఇయర్‌ఫోన్స్‌ చెవిలో పెట్టుకుని వారి లోకాల్లో మునిగిపోతారు. ఫోన్ మాట్లాడడం, పాటలు వినడం, వీడియోలు చూడడం.. ఇలా ఏవైనా సరే ఇయర్ ఫోన్స్ ‌ద్వారానే చేస్తున్నారు. ఏదైనా సరే మితంగా ఉంటేనే మంచిది. కానీ, మనకి సౌకర్యంగా ఉన్నాయన్న భావనతో అతిగా వాడడం సమస్యలకు దారి తీస్తుంది. ఇయర్‌ఫోన్స్‌ను ఎక్కువగా వాడేవారు చెవిటివారిగా మారే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇయర్‌ ఫోన్స్‌ ఎక్కువ సేపు, పెద్ద శబ్దంతో వినేవారికి వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. BMJ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్స్ వాడే 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు వినికిడిని కోల్పోయే ప్రమాదం ఉంది.

గతంలో ప్రచురించిన పరిశోధన ప్రకారం, చాలా మంది ఇయర్‌ఫోన్‌లలో 105 dB వరకు వాల్యూమ్‌తో మ్యూజిక్‌ వింటున్నారు. పార్టీలలోనూ.. వాల్యూమ్‌ స్థాయి 104 నుంచి 112 db వరకు ఉంటుంది. ఈ లెవల్‌ వాల్యూమ్‌ చెవులకు హానికరమని అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు ఎక్కువసేపు పెద్ద శబ్దంతో వింటే.. వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వినికిడి దెబ్బతినకుండా ఉండటానికి హెడ్‌ఫోన్ వాల్యూమ్‌ను తగ్గించి వినండి. ఇయర్ ఫోన్స్ వాడినప్పుడు సౌండ్ తగ్గించండి. సాధారణంగా వాల్యూమ్‌ని డెసిబెల్స్‌తో కొలుస్తారు. సౌండ్ 60 డెసిబుల్స్ కంటే తక్కువగా ఉంటే వినికిడి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. ఇది ఎప్పుడైతే 85 దాటుతుందో.. అప్పుడే సమస్య ఏర్పడుతుంది. పరికరాలలో డెసిబెల్ అవుట్‌పుట్‌ను కొలవడం కష్టంగా ఉన్నప్పటికీ చెవులకి ఎలాంటి సమస్య రాకుండా సెట్టింగ్స్‌ని 50 శాతం ఉంచడం బెస్ట్ ఆప్షన్.

what happens if you use ear phones excessively

ఓవర్-ది-ఇయర్ హెడ్‌ఫోన్‌లలో.. ఇయర్‌డ్రమ్‌లకు దూరంగా ఉంటాయి. ఇయర్ ఫోన్స్ చిన్నగా ఉండి చెవిలోకి వెళ్ళిపోతాయి. హెడ్ ఫోన్స్ పెద్దగా ఉండి చెవులని కప్పి ఉంటాయి. హెడ్ ఫోన్స్ ఇయర్ కెనాల్‌ నుంచి కర్ణభేరి మధ్య దూరాన్ని పెంచుతాయి. వినికిడి లోపాన్ని తగ్గించడానికి ఈ దూరం ముఖ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు. బయట శబ్ధాలు వినిపించకుండా ఉండటానికి.. హెడ్‌ఫోన్‌ల వాల్యూమ్‌ను పెంచుతారు. ఇది మీ కర్ణభేరిని దెబ్బతీస్తుంది. అందుకే వాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ వాడటం మంచిది. ఇది తక్కువ వాల్యూమ్‌లో మీకు మంచి అనుభవాన్ని అందిస్తుంది. ఎక్కువసేపు ఇయర్ ఫోన్స్ వాడితే సమస్యలు వస్తాయి. కాబట్టి.. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడం వల్ల చెవులకి కాస్తా రిలీఫ్‌గా ఉంటుంది. ప్రతి 30 నిమిషాలకి ఓ 5 నిమిషాలు, లేదా గంటకి 10 నిమిషాల బ్రేక్ తీసుకోవడం మంచిది.

Admin

Recent Posts