వైద్య విజ్ఞానం

బ‌ట్ట‌త‌ల ఉన్న పురుషుల‌కు శృంగార సామర్థ్యం ఎక్కువ‌గా ఉంటుందా..?

బట్టతల ఉన్న పురుషులు మానసికంగా చాలా వేదనకు గురవుతారు. కానీ ఇప్పుడు ఒక వార్త తెగవైరల్‌ అవుతోంది. బట్టతల ఉన్న పురుషులు బెడ్‌రూమ్‌లో రతిలో బాగా పాల్గొంటారని, వారికి లైంగిక సామార్థ్యం ఎక్కువగా ఉంటుందని ప్రచారం సాగుతుంది. బట్టతల ఉంటే బెడ్ రూమ్‌లో తమ పార్టనర్‌తో బాగా రాణిస్తారట. ఇంతకీ బట్టతలకు, మగతనానికి లింకేమిటీ? బట్టతల ఉంటే నిజంగానే బెడ్ రూమ్‌లో రెచ్చిపోతారా? దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో చూద్దామా. బట్టతల పురుషులకు వరమని, పడక గదిలో తమ పార్టనర్‌ను బాగా సుఖపెడతారనే విషయం ఇప్పటిది కాదు.. కొన్ని శతాబ్దాలుగా దీనిపై చర్చ నడుస్తోంది. బట్టతల గలవారిలో టెస్టోస్టేరోన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని, అందుకే బట్టతల ఉన్నవారు ఆ విషయంలో మెరుగ్గా ఉంటారట. ఈ నేపథ్యంలో పరిశోధకులు ఇది ఎంతవరకు నిజమో తెలుసుకొనే ప్రయత్నం చేశారు.

బట్టతలకు లైంగిక శక్తికి అస్సలు సంబంధమే లేదని పరిశోధకులు అధ్యయనం ద్వారా స్పష్టం చేశారు. జుట్టు కోల్పోతే మగతనం పెరగదని తేల్చి చెప్పారు. యూకేకు చెందిన ఓ వైద్యుడు మీడియాతో మాట్లాడుతూ బట్టతలకు, పురషత్వానికి చాలామంది లింకు పెడుతున్నారు. వాస్తవానికి పురషత్వం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో లైంగిక ఆరోగ్యం, సంతానోత్పత్తి సామర్థ్యం వంటివి ఉంటాయి. ఇవన్నీ మెరుగ్గా ఉండాలంటే.. భౌతిక, మానసిక, లైఫ్‌స్టైల్ అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, బట్టతల ఉంటే పురుషత్వం మెరుగ్గా ఉంటుందనే విషయాన్ని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు.

what is the relation between bald head and sexual stamina

ఇటీవల మెడికల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రేలియాలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో కూడా బట్టతల గల పురుషుల్లో లైంగికశక్తి అంశాన్ని ప్రస్తావించింది. బట్టతలకు, పురుషత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. బట్టతల కలిగిన పురుషులు.. తమ జీవితంలో నలుగురి కంటే ఎక్కువ మంది మహిళలతో లైంగిక సంబంధం కలిగి ఉండే అవకాశాలు చాలా తక్కువ అని తాజా అధ్యయనం పేర్కొంది. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. 18 నుంచి 20 ఏళ్ల వయస్సులోనే అతిగా లైంగిక కార్యకలాపాలకు పాల్పడే యువతకు బట్టతల వచ్చే అవకాశాలు పెరుగుతాయని ఓ సర్వే పేర్కొంది. ఈ సర్వే వల్లనే బట్టతల గల పురుషులు ఎక్కువ లైంగిక శక్తిని కలిగి ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతుంది తప్ప అందులో ఎలాంటి నిజం లేదు.

Admin

Recent Posts