వైద్య విజ్ఞానం

కింద ఉండే వెంట్రుక‌ల‌తో మ‌న‌కు ఉప‌యోగం ఏంటి..? వాటిని తీసేయాలా..?

Animal movie లో క్రింది వేంట్రుకలు తీసేశావా? వాటిని దేవుడు అక్కడ ఇచ్చాడంటే ఏదో ఉపయోగం ఉంటుంది అనే కదా? అనే డైలాగ్ ఉంటుంది. నిజంగానే ఏ ఉపయోగం ఉంటుంది..? సహజంగా జీవుల‌న్నింటి శరీరం మీద వెంట్రుకలు ఉంటాయి, ఈ వెంట్రుకలు కలిగి ఉండటం అనేది జీవి యొక్క జీవన శైలి, ఆకృతి, పరిమాణం, నివాసం ప్రాంతం, వాతావరణం వంటి అంశాల ప్రాధాన్యతతో ముడి పడినది. మనుషుల‌లో లింగ భేదం, వయస్సుకు అనుగుణంగా ఏర్వాపడే వారి వారి శారీరక ఆకృతి, స్థితిగతులచే వెంట్రుకలు కొందరిలో అధికంగా మారి కొందరిలో మితంగా ఏర్పడుతాయి. ఈ వెంట్రుకలు వారికి అందాన్ని, హుందాని, సౌందర్యాన్ని ఇస్తూ శారీరక రక్షణని ‌కల్పిస్తాయి.

తల లేదా నెత్తిన వెంట్రుకలు ఎండ వేడిమి నుంచి తలను కాపాడుతాయి. మనుషులు శరీర కదలికలు జరిపినప్పుడు మర్మాంగాల మధ్య‌ చర్మం రాసుకొని పుండ్లు వంటివి ఏర్పడకుండా వెంట్రుకలు వాహకంగా ఉండి రక్షిస్తాయి.

what is the use with pubic hair

గాలిలో ఉండే దుమ్ము ధూళి కణాలు ముక్కు‌, చెవిలోనికి వెల్లనివ్వకుండా వెంట్రుకలు ఒక కవచంలా పనిచేస్తాయి. అడిగి ప్రశ్నకు సమాధానం చాలా పెద్దది, కాని నాకు తెలిసిన మేరకు వెంట్రుకల ఆవశ్యకత, ప్రత్యేకత ఏమిటో మీకు చెప్పాను.

Admin

Recent Posts